ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

విచారణకు హాజరు కాని సజ్జల భార్గవ్‌ రెడ్డి - వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసుల దర్యాప్తు వేగం - YSRCP SOCIAL MEDIA POSTS CASE

వర్రా రవీందర్‌ రెడ్డికి డిసెంబర్‌ 9 వరకు రిమాండ్‌ - సోమవారం విచారణకు రాని సజ్జల భార్గవ్‌ రెడ్డి

Police Investigation Speed In Varra Ravindra Reddy Case
Police Investigation Speed In Varra Ravindra Reddy Case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2024, 10:40 AM IST

Updated : Nov 26, 2024, 11:00 AM IST

Police Investigation Speed In Varra Ravindra Reddy Case : సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వైఎస్సార్సీపీ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రవీందర్‌రెడ్డి వాంగ్మూలం మేరకు ఆ పార్టీ సామాజిక కార్యకర్తలను పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు కేసులోA-2గా ఉన్న సజ్జల భార్గవ్‌రెడ్డి విచారణకు హాజరు కాకపోగా మరో వారం రోజులు గడువు కోరారు. వర్రా రవీందర్‌రెడ్డి పది రోజుల కస్టడీ పిటిషన్‌పై నేడు కడప కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.

విచారణకు రాని సజ్జల భార్గవ్‌ రెడ్డి :గత ఐదేళ్లగా జగన్‌ను విమర్శించిన టీడీపీ, జనసేన నేతలే లక్ష్యంగా సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన, పెట్టించిన వారిపై చర్యలు తీసుకునేందుకు వైఎస్సార్ జిల్లా పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఈనెల 8న పులివెందుల పోలీస్‌ స్టేషన్‌లో ఐటీ, బీఎన్​ఎస్, అట్రాసిటీ చట్టాల కింద వర్రా రవీందర్‌రెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. మొత్తం 46 మందిని నిందితులుగా చేర్చారు.

వర్రా రవీందర్‌రెడ్డి వాంగ్మూలం - సజ్జల భార్గవ్‌రెడ్డి అరెస్టుకు రంగం సిద్దం!

వర్రా రవీందర్‌రెడ్డి ప్రస్తుతం కడప జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. సోమవారంతో రిమాండ్‌ గడువు ముగియడంతో ఆయన్ని పోలీసులు కడప కోర్టులో హాజరు పరిచారు. రవీందర్‌రెడ్డికి డిసెంబర్‌ 9 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ కడప మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో A-2గా ఉన్న సజ్జల భార్గవ్‌రెడ్డికి ఇంతకుముందే 41-A నోటీసులు జారీ చేసి సోమవారం విచారణకు రావాలని పేర్కొన్నారు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. అనివార్య కారణాలతో రాలేకపోతున్నానని మరో వారం రోజులు గడువు కావాలని పులివెందుల డీఎస్పీ వాట్సప్‌ ద్వారా సమాచారం పంపారు. మరోవైపు జగన్‌ బంధువు అర్జున్‌రెడ్డి సైతం విచారణకు రాలేదు.

సోషల్ మీడియాతో జాగ్రత్త గురూ - తేడా వస్తే జైలుకే!

సజ్జల భార్గవ్‌రెడ్డి సూచనల మేరకు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని గుర్తించి 41-A నోటీసులు అందించి విచారణకు రావాలని పోలీసులు పిలుస్తున్నారు. ఇప్పటివరకు 15 మందికి 41-A నోటీసులు ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విజయవాడకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఆనం నరేంద్రరెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన విష్ణువర్ధన్‌ రెడ్డిని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ కడప సైబర్‌ క్రైం పోలీసులు స్టేషన్‌లో ప్రశ్నించారు. వారిద్దరు పెట్టిన పోస్టులను వారి ముందుంచి ఎవరి సూచనల మేరకు ఈ విధంగా పెట్టారని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మంగళవారం మరికొందరిని పిలిచి పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.

"సీఐడీ కస్టడీ మిస్టరీ" - ఈ కేసులో పెద్ద చేపలు త్వరలో తెరపైకి : RRR

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ :వర్రా రవీందర్‌రెడ్డిపై కాకినాడ జిల్లా కడప పోలీస్‌ స్టేషన్‌లోనూ కేసు నమోదైంది. ఆ కేసులో పీటీ వారెంట్‌పై సోమవారం మధ్యాహ్నం వర్రాను కాకినాడ మెజిస్ట్రేట్‌ ముందు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరు పరిచారు. మరోవైపు రవీందర్‌రెడ్డిని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్‌పై కడప కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి కడప కోర్టులో వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. రెండు వారాల నుంచి రాఘవరెడ్డి పరారీలో ఉన్నారు.

'మార్ఫింగ్ ఫొటోలు-అసభ్యకర పోస్టులు' - ఏ-1, ఏ-2, ఏ-3పై కేసులు నమోదు

"ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో?" - అజ్ఞాతంలోకి 'పులివెందుల' వైఎస్సార్సీపీ నేతలు

Last Updated : Nov 26, 2024, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details