తెలంగాణ

telangana

ETV Bharat / politics

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన​ - షెడ్యూల్​ ఇదే - PM MODI Telangana Tour 2024 - PM MODI TELANGANA TOUR 2024

PM Modi Telangana Tour Schedule 2024 : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 30, వచ్చే నెల 3, 4 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించి పార్టీ శ్రేణుల్లో జోష్​ నింపనున్నారు. మొత్తం 6 సభల్లో పాల్గొననున్నారు.

Lok Sabha Election 2024
PM Modi Election Campaign in Telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 1:30 PM IST

PM MODI Telangana Tour Schedule 2024: రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయం హీటెక్కుతోంది. ప్రధాన పార్టీ నాయకులు ప్రజల్లో తిరుగుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి రోజుకు రెండు నుంచి మూడు సభల్లో పాల్గొంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. మరోవైపు బీఆర్​ఎస్ అధినేత కేసీఆర్​ ఇవాళ్టి నుంచి బస్సు యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన చేయనున్నారు.

PM Modi Election Campaign in Telangana : ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 30, వచ్చే నెల 3, 4 తేదీల్లో బీజేపీ నాయకత్వంలో జరిగే సభల్లో పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో పది సంవత్సరాల్లో తాను చేసిన దేశాభివృద్ధి గురించి ప్రజలకు వివరించనున్నారు. సంక్షేమ పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలను ప్రజలకు మోదీ చెప్పనున్నారని బీజేపీ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలపైన క్షేత్ర స్థాయిలో ఎండగడుతారని తెలిపాయి.

'కాంగ్రెస్ యువరాజుకు వయనాడ్​లోనూ కష్టమే- కొత్త స్థానం చూసుకోవాలి' - Lok Sabha Election 2024

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్​ వివరాలు

  • ఈ నెల 30న జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్ నియోజకవర్గంలో బహిరంగ సభ.
  • అదే రోజుసాయంత్రం ఐటీ ఉద్యోగులతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సమావేశం.
  • మే 3న వరంగల్​ పార్లమెంట్ పరిధిలో బహిరంగ సభ.
  • అనంతరం భువనగిరి, నల్గొండ పార్లమెంట్​లను కలుపుతూ సాయంత్రం మరో బహిరంగ సభ.
  • మే 4న మహబూబ్​నగర్​ పార్లమెంట్​లోని నారాయణ్​ పేటలో బహిరంగ సభ.
  • తరవాత చేవెళ్ల పార్లమెంట్​లోని వికారాబాద్​లో మరో సభ.

BJP Leaders Election Campaign 2024: రాష్ట్రంలో డబుల్​ డిజిట్​ ​గెలుపే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. దీనికి అనుగుణంగానే పార్టీ అగ్రనాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. స్థానిక బీజేపీ నాయకులు కూడా ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే బీజేపీ సంకల్ప పత్ర పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోను ఆయుధంగా చేసుకుని ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. కేంద్రంలో పది సంవత్సరాల అభివృద్ధిని వజ్రాయుధంలా మార్చుకుని జోరుగా ప్రచారం చేస్తున్నారు.

2047 వికసిత్ భారత్ కోసం పెద్ద ప్రణాళికలు- ఎవరూ భయపడాల్సిన అవసరంలేదు : మోదీ - Modi Interview Lok Sabha Polls

'భారత్​లోకి ఉగ్రవాదులు ఎగుమతి, సొంత దేశంలో గోధుమపిండి లేక అవస్థలు'- పాక్​కు మోదీ చురకలు - Pakistan Food Crisis

ABOUT THE AUTHOR

...view details