PM Modi Adilabad Visit Today :ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి(CM Revath), గవర్నర్ తమిళిసై హాజరవుతున్నందున ఆదిలాబాద్ పట్టణంలో పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రముఖల రాక కోసం ఎనిమిది హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. ఉదయం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాగపూర్‌కు చేరుకోనున్న ప్రధాని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 10:20 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటారు.
PM Modi CM Revanth in Adilabad Tour Today :అంతకుముందే హైదరాబాద్ నుంచి గవర్నర్ తమిళిసై ఉదయం 9:05 నిమిషాలకు, సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం 9:30 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటారు. ముగ్గురు కలిసి ఇందిరా ప్రియదర్శిని మైదానంలో 6 వేల 700 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ, జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అధికారిక కార్యక్రమాల అనంతరం జరిగే బీజేపీ బహిరంగ సభలో మోదీ ఒక్కరే పాల్గొంటారు. పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు. ఈ నేపథ్యంలో అధికారం యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టింది.
'ఆదిలాబాద్‌లో పీఎం మోదీ సభ కోసం జిల్లా నుంచి 2 వేల పోలీసులను మోహరించాం. ఇక్కడ ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 12 వరకు మీటింగ్ ఉంటుంది. దీని కోసం వీఐపీ సెక్యూరిటీ, సభ చోట మొత్తం చూసుకుంటున్నాం. స్టేడియం, హెలిప్యాడ్, టౌన్ బయట ఉంది. దీని వల్ల పబ్లిక్కు ఎలాంటి ఇబ్బందులు రావు.' - ఆలయం గౌస్, ఆదిలాబాద్ ఎస్పీ
PM Modi Telangana Tour :ఆదిలాబాద్ పట్టణానికి ప్రముఖులు వస్తున్నందున పోలీసు యంత్రాంగం 2 వేల మంది సిబ్బందితో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. బహిరంగసభ జరిగే ప్రియదర్శిని మైదానం పరిసరాల కాలనీల పరిధిలో సాధారణ రాకపోకలను యంత్రాంగం దారి మళ్లించింది. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మోదీ పాల్గొనే బహిరంగసభను విజయవంతం చేసేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. మోదీ(PM Modi Adilabad) రాకతో ఆదిలాబాద్‌లో పండగ వాతావరణం నెలకొననుందన్న బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.