తెలంగాణ

telangana

ETV Bharat / politics

కేసీఆర్​ సర్కార్​ అవినీతిని ఊరూరా చాటి చెప్పండి - పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్​రెడ్డి పిలుపు

PEC Meeting in Hyderabad : కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్ల కోసం కేసీఆర్‌ అక్రమాలకు పాల్పడ్డారని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ఊరూరా చాటిచెప్పాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ నేతలకు సూచించారు. లోక్‌సభ ఎన్నికల అంశంపై జరిగిన కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ భేటీలో దిశానిర్దేశం చేసిన ఆయన, ఎన్నికల్లో పార్టీని గెలిపించేలా అభ్యర్థుల ఎంపిక, నేతల పనితీరు ఉండాలన్నారు. ప్రాజెక్టులను ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించిందంటూ కేసీఆర్‌ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని రేవంత్‌రెడ్డి తెలిపారు.

PEC Meeting on Parliament Elections
PEC Meeting on MP Tickets

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 7:20 AM IST

కాంగ్రెస్​ ఎంపీ ఆశావాహులపై కసరత్తు

PEC Meeting in Hyderabad : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవటమే లక్ష్యంగా కాంగ్రెస్‌ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు పార్టీ వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు గానూ మంగళవారం గాంధీభవన్‌లో రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన 'ప్రదేశ్ ఎన్నికల కమిటీ' సమావేశమైంది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించిన నేపథ్యంలో నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని బీఆర్ఎస్​కు తెలుసునని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై సభ్యుల వివరాలు తీసుకున్న పీఈసీ కమిటీ

Revanth Reddy Instructions to Congress Leaders: ప్రాజెక్టులను ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించిందంటూ దుష్ట్రచారం చేసి, కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు కేసీఆర్(KCR) కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రేవంత్‌రెడ్డి నేతలకు తెలిపారు. మేడిగడ్డ అవినీతిపై విచారణ, కఠిన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉండటంతో, దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించారంటూ కేసీఆర్, బీఆర్ఎస్​ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దీన్ని పార్టీ నేతలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

పార్లమెంటు పోరుకు కాంగ్రెస్ కసరత్తు - నేడు పీఈసీ భేటీలో అభ్యర్థుల ఎంపిక

Leaders Discussion in PEC Meeting : గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్‌ నేతలంతా ఊరూరా గట్టిగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఎంపీ అభ్యర్థులుగా కచ్చితంగా గెలిచే సత్తా ఉన్నవారినే ఎంపిక చేయాలని సూచించారు. టికెట్ల కేటాయింపులో అన్ని సామాజికవర్గాలకు పార్టీ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించేలా అభ్యర్థుల ఎంపిక, నేతల పనితీరు ఉండాలని చెప్పారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సోనియాగాంధీని పోటీ చేసేలా ఒప్పించాలని పలువురు నేతలు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది.

PEC Meeting on MP Tickets: ఖమ్మం నుంచి సోనియా, ప్రియాంకగాంధీలు పోటీ చేయని పక్షంలో, ఆ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని సీనియర్‌ నేత వీహెచ్​ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, కమిటీ నుంచి తీసుకున్న అభిప్రాయాలను మాత్రమే కేంద్ర ఎన్నికల కమిటీ(Central Election Committee)కి నివేదిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలవాలంటే మరింత బలమైన నేతలను బరిలో దించాలని పలువురు కమిటీ సభ్యులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకొస్తే ఆహ్వానించాలని అభిప్రాయపడ్డారు.

17 పార్లమెంట్ స్థానాలకు 309 దరఖాస్తులు - గెలుపు గుర్రాల ఎంపిక కోసం రేపు పీఈసీ కీలక సమావేశం

PECMeeting onv Parliament Elections :ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసిన 309 మంది వివరాలను పుస్తకం రూపంలో అందజేశామని, బుధవారం సాయంత్రంలోగా ఒక్కో సెగ్మెంట్‌కు మూడేసి పేర్లు సూచిస్తూ సీల్డ్ కవర్లో అందజేయాలని పీఈసీ సభ్యులకు కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జీ దీపాదాస్‌ మున్షీ చెప్పినట్లు తెలిసింది. ఏ నియోజకవర్గానికి ఎవరి పేర్లు సూచించారో రహస్యంగా ఉంచాలని పీఈసీ(PEC) తెలిపింది. ఎంపిక చేసిన పేర్లను పార్టీ స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి బలమైన అభ్యర్థులను నిర్ణయిస్తుందని చెప్పారు. దరఖాస్తుదారుల పేర్లే కాకుండా, ఇంకా ఎవరైనా బలమైన అభ్యర్థులు ఉంటే వారి పేర్లను సూచించవచ్చని నేతలు తెలిపారు.

"పార్లమెంట్​ ఎన్నికల్లో దాదాపుగా క్లీన్​స్వీప్​ చేయబోతున్నాం. 13-14 స్థానాలు గెలవడం గ్యారంటీ. బీఆర్ఎస్​కు ఈ ఎన్నికల్లో జీరో స్థానాలు వస్తాయి. మాకు కాంగ్రెస్​ ఎంపీల అభ్యర్థుల ఆశావాహుల దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. వాటిని ఎలా షార్ట్​ లిస్ట్​ చేయాలనే అంశంపై చర్చ జరిగింది."- ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మంత్రి

PECMeeting Decision : కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ హరీశ్‌ చౌదరి, సభ్యులు జిగ్నేశ్‌ మేవాని, విశ్వజిత్ ఇవాళ అందుబాటులో ఉండి, అభ్యర్థుల ఎంపికపై నేతల అభిప్రాయాలు తీసుకుంటారు. అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ వడపోత అనంతరం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించే జాబితాపై సర్వేలు జరపనున్నారు. అనంతరం సర్వే నివేదికలతో కూడిన జాబితాను సీఈసీకి నివేదిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తవారిని పార్టీలో చేర్చుకోవాలన్న నిర్ణయం కారణంగా అభ్యర్థుల ఎంపికపై చివరి వరకు చేర్పులు, మార్పులు ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

Congress Screening Committee to Meet on 20th September : ఈ నెల 20న కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీ సమావేశం.. అప్పుడే అభ్యర్థుల జాబితా

ABOUT THE AUTHOR

...view details