తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 3:44 PM IST

ETV Bharat / politics

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల సుడిగాలి ప్రదర్శన - ఆ రెండు రోజులు రాహుల్​, ప్రియాంక గాంధీలు ఫుల్​ బిజీ - Rahul Priyanka Gandhi Campaign Ts

Congress National Leaders Campaign in Telangana : ఎన్నికలకు మరో పదిరోజులే ఉండడంతో కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి ప్రదర్శనకు సిద్దమయ్యారు. సీఎం రేవంత్​ రెడ్డితో పాటు రాహుల్, ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. తాజాగా వారి ఎన్నికల ప్రచార షెడ్యూల్​ను పీసీసీ ప్రకటించింది.

Rahul and Priyanka Gandhi Campaign Schedule
Rahul and Priyanka Gandhi Campaign in Telangana (Etv Bharat)

Rahul and Priyanka Gandhi Campaign in Telangana : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, రాహుల్, ప్రియాంక గాంధీల ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను పీసీసీ ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 11 తేదీ వరకు రాహుల్​, ప్రియాంక గాంధీలు విడివిడిగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కాగా సీఎం రేవంత్​ రెడ్డి సోమవారం నుంచి జన జాతర సభల్లో హాజరవుతూనే, రోడ్​ షోలతో పాటు కార్నర్​ సమావేశాల్లో పాల్గొంటారు.

CM Revanth Election Campaign : సికింద్రాబాద్​ నియోజకవర్గంలోని అంబర్​పేట్​లో ఇవాళ సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్​ రెడ్డి రోడ్​ షోలో పాల్గొంటారని, అనంతరం కార్నర్​ సమావేశంలో మాట్లాడతారని ఖైరతాబాద్​ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్​ రెడ్డి తెలిపారు. ఫీవర్‌ ఆసుపత్రి కూడలి వద్ద కార్నర్‌ సమావేశం ఉంటుందని వివరించారు. రాత్రి 7.30గంటలకు ఉప్పల్ రోడ్ షో, కార్నర్‌ సమావేశం ఉంటుందని తెలిపారు. రాత్రి 9గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కార్నర్ సమావేశంలో పాల్గొంటారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉంది - కేంద్రంలో కూడా ఏర్పాటు చేస్తాం : రాహుల్ గాంధీ - Rahul Gandhi Speech at Nirmal

మంగళవారం 7వ తేదీన సాయంత్రం 4గంటలకు కరీంనగర్ జన జాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి హజరై ప్రసంగిస్తారు. సాయంత్రం 6.30గంటలకు వరంగల్ ఈస్ట్ రోడ్ షో, కార్నర్ సమావేశాల్లో పాల్గొంటారని తెలిపారు. రాత్రి 7.45గంటలకు వరంగల్ వెస్ట్ రోడ్ షో, కార్నర్ సమావేశం ఉంటుందని వివరించారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆర్మూర్ కార్నర్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు నిజామాబాద్ రోడ్ షో, కార్నర్ సమావేశంలో పాల్గొని ఎన్నికల ప్రచారం చేస్తారని వివరించారు.

Rahul and Priyanka Gandhi Schedule :ఈ నెల 9వ తేదీన రాహుల్‌, 10న ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో పర్యటిస్తారని తెలిపారు. 9వ తేదీన సాయంత్రం 4గంటలకు నర్సాపూర్ జన జాతర సభ, సాయంత్రం 6గంటలకు ఎల్బీనగర్​లోని సరూర్​నగర్ స్టేడియంలో నిర్వహించే జన జాతర సభకి రాహుల్​ గాంధీ హాజరవుతారని వివరించారు. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12గంటలకు కామారెడ్డి జన జాతర సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు. అనంతరం సాయంత్రం 4గంటలకు తాండూరు జన జాతర సభలో ప్రసంగిస్తారు. తర్వాత సాయంత్రం 6గంటలకు షాద్ నగర్ రోడ్ షో పాల్గొని కార్నర్ సమావేశంలో మాట్లాడుతారు. ఈ నెల11వ తేదీన ఉదయం 10గంటలకు పఠాన్ చెరు రోడ్ షో నిర్వహించి, కార్నర్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు మక్తల్ జన జాతర సభకి రేవంత్‌ రెడ్డి హాజరవుతారని తెలిపారు.

అంబేడ్కర్​ రచించిన రాజ్యాంగాన్ని మోదీ చించేయాలని చూస్తున్నారు : రాహుల్​ గాంధీ - Rahul Gandhi Election Campaign

దేశాన్ని అదానీ, అంబానీలకు తాకట్టుపెట్టాలని చూస్తున్నారు : రేవంత్ రెడ్డి - cm revanth in tukkuguda corner meet

ABOUT THE AUTHOR

...view details