Nagula Chavithi : మన పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడు శివుడికి వాసుకిగా ఉంటాడు. అలాగే శ్రీ మహావిష్ణువుకు శేషుడిగా తోడు ఉంటాడు. కాబట్టి ఈ నాగుల చవితి రోజు భక్తులు పూజలు చేసి నైవేద్యాలను సమర్పిస్తారు. ఇలా చేయడం ద్వారా సర్వరోగాలు పోయి, సౌభాగ్యులవుతారని విశ్వసిస్తారు. కుజ దోషం, కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
నల్గొండ జిల్లాలోని మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామ ప్రజలు అనాదిగా నాగేంద్రుడినే ఇలవేల్పుగా భావిస్తున్నారు. దశాబ్దాలుగా నాగుల చవితిని స్థానికులు తమ బంధువులతో కలిసి ఆనందంగా జరుపుకొంటారు. నాగమయ్యగా ఆరాధించే ఆ దేవుడికి ప్రత్యేకంగా ఓ ఆలయమూ నిర్మించారు. ప్రతి ఏటా నాగుల చవితిని పురస్కరించుకుని గ్రామంలో ఆటల పోటీలు, కోలాట భజనలు, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
నెరవేరిన కోరిక : కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఊర చెరువు కట్టపై ఉన్న నాగమయ్య ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. రోజంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గడుపుతారు. బక్కమంతుల గూడెంలో శతాబ్దాల క్రితం ఈ గ్రామానికి చెందిన దంపతులు తమకు సంతానం కలిగాలని కోరుకున్నారు. వారి కోరిక సఫలమైతే నాగేంద్రుని విగ్రహం ప్రతిష్ఠిస్తామని మొక్కుకున్నారట. వారి కోరిక నెరవేరడంతో ఆ దంపతులు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
అప్పటి నుంచి నాగదేవతను ఈ పల్లెవాసులు ఇలవేల్పుగా భావించి ఆరాధిస్తున్నారు. ఆలయానికి ఆకర్షణీయ రంగులు వేసి విద్యుత్తు తోరణాలతో అలంకరించారు. ఈ రోజు (నవంబర్ 05)న కబడ్డీ పోటీలు, నాటక ప్రదర్శనతో పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుందని నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు.
కార్తిక మాసం వేళ నెల రోజుల పాటు నిష్ఠతో ప్రాతఃకాల (తెల్లవారి జామున) అభిషేకాలు, దీపారాధనలు చేస్తే అత్యంత శుభం జరుగుతుంది. సంధ్యా సమయంలో దీపారాధనలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని, గ్రహ దోషలు సైతం తొలగిపోయి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారని భక్తుల నమ్మకం. నెల రోజులపాటు శివాలయాల్లో పరమశివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. కార్తిక మాసం మహోత్సవాల్లో భాగంగా నేడు నాగుల చవితి పండుగ జరుగుతోంది.
నాగుల చవితి స్పెషల్ : మంగళవారం ఈ పూజ చేస్తే ఆ దోషాలన్నీ తొలగి సకల శుభాలు!
నాగుల చవితి స్పెషల్ ప్రసాదాలు - రుచికరమైన చలిమిడి, చిమ్మిలి - ఇలా చేస్తే నిమిషాల్లో ప్రిపేర్!