ETV Bharat / sports

'భారత్‌లోనే 2036 ఒలింపిక్స్‌ నిర్వహిస్తాం!'- ఇంటర్నేషనల్ ఒలింపిక్‌ సంఘానికి IOA లెటర్ - OLYMPICS 2036 IN INDIA

2036లో ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ నిర్వహణకు ఆసక్తి వ్యక్తం చేసిన భారత్- అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి లేఖ రాసిన భారత ఒలింపిక్ సంఘం

Olympics 2036 In India
Olympics 2036 In India (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 5, 2024, 2:48 PM IST

Updated : Nov 5, 2024, 4:10 PM IST

Olympics 2036 In India : విశ్వ క్రీడలైన ఒలింపిక్స్‌ నిర్వహణకు భారత్‌ రెండీ అవుతోంది!. ఈ మేరకు 2036లో ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ నిర్వహణకు ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేస్తూ భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ)- అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘానికి(ఐఓసీ) ఫ్యూచర్​ హోస్ట్​ కమిషన్​కు అధికారికంగా లేఖ పంపినట్లు తెలుస్తోంది. ఈ లెటర్​ ఆఫ్​ ఇంటెంట్​ను ఐఓఏ అక్టోబర్ 1న పంపించినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు సమాచారం. దీంతో ఒలింపిక్స్​ నిర్వహణ కోరికను నెరవేర్చుకునేందుకు తొలి అడుగుపడినట్లు అయింది. దీనికంటే ముందు ఐఓసీతో 2036 ఒలింపిక్స్​ నిర్వహించే అంశంపై భారత్​ అనధికార చర్చలు జరిపింది. తాజాగా పరిణామంతో ఇక దీనిపై నిరంతర చర్చలు జరుగుతాయి.

అయితే వచ్చే ఏడాది జరిగే ఐఓసీ ఎన్నికలు జరిగేంత వరకు హోస్ట్​పై నిర్ణయం తీసుకోరు. మరోవైపు, 2036 ఒలింక్స్​ నిర్వహణ కోసం చాలా దేశాలతో భారత్​ పోటీ పడాల్సి ఉంటుంది. సౌదీ అరేబియా, ఖతార్, తుర్కియే, వంటి అనేక దేశాలు ఒలింపిక్స్ నిర్వహణపై ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్​ మొదటి 2032 ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఆసక్తి చూపించింది. కానీ కొన్ని కారణాల వల్ల 2036లో నిర్వహించాలని నిర్ణయించుకుంది.

అయితే విస్తృత స్థాయిలో బిడ్డింగ్‌ కాకుండా ఆసక్తి ఉన్న దేశాల నుంచి వచ్చే అప్లికేషన్లను పరిశీలించి ఐఓసీ నాయకత్వ విభాగం ఈ హోస్టింగ్ రైట్స్​ను కట్టబెట్టే ఆస్కారం ఉంది. స్పాన్సర్లు, బ్రాడ్​కాస్టింగ్ హక్కులు, ప్రభుత్వ మద్దతు, ప్రజల ఆదరణ, ఇలా ఏ రకంగా చూసుకున్నా భారత్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించడం వల్ల ఐఓసీకి లాభం చేకూరే అవకాశం ఉంది. అందుకే ఐఓసీ కూడా భారత్‌ వైపు మొగ్గు చూపేందుకు ఆసక్తితో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇండియా బిడ్ ఓకే అయితే గుజరాత్​లోని అహ్మదాబాద్​లో ఒలింపింక్స్​ క్రీడలు జరుగుతాయి.

2036 ఒలింపిక్స్‌కు భారత్‌ ఆతిథ్యమిచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. "ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం భారతీయులు ఉత్సాహంగా ఉన్నారు. 2036 ఒలింపిక్స్‌ను హోస్ట్​ చేసేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలనూ చేస్తాం. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గం. ఇది 140 కోట్ల మంది భారతీయుల కల. అలాగే 2029 యూత్‌ ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు రెడీగా ఉన్నాం" అని ఆయన అన్నారు.

Last Updated : Nov 5, 2024, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.