ETV Bharat / state

పోకిరీలకు అడ్డాగా ఐటీ కారిడార్ - అటువైపుగా వెళ్లాలంటేనే భయపడుతున్న నగరవాసులు

రీల్స్ కోసం బైక్ స్టంట్స్ చేస్తున్న యువత - నడిరోడ్డుపై బీభత్సం సృష్టిస్తున్న పోకిరీలు

RACING STUNTS IN T HUB
BIKE STUNTS AT IT CORRIDOR HYDERABAD (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2024, 1:47 PM IST

Updated : Nov 5, 2024, 3:02 PM IST

Bike Racing Stunts in IT Corridor : రాష్ట్రానికే తలమానికమైన ఐటీ కారిడార్ రాత్రిపూట పోకిరీలకు అడ్డాగా మారుతోంది. నగరం నలుమూలల నుంచి ద్విచక్ర వాహనాలు, కార్ల మీద వచ్చే ఆకతాయిలు టీ హబ్ రోడ్డులో ప్రమాదకర స్టంట్లు, రేసింగ్ నిర్వహిస్తూ హల్చల్ చేస్తున్నారు. వారాంతాలు, పండుగలు, ప్రత్యేక సమయాల్లో ఐటీ హబ్‌కు చేరుకుని నడిరోడ్డుపై బీభత్సం సృష్టిస్తున్నారు. దీనిని పోలీసులు పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

ఐటీ కారిడార్​లో బైక్​ స్టంట్స్​తో రెచ్చిపోతున్న ఆకతాయిలు (ETV Bharat)

కొందర్ని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నా, బైకులు స్వాధీనం చేసుకుంటున్నా ఎప్పటికప్పుడు మళ్లీ పాత కథే మొదలవుతోంది. పోలీసులు సరైన వ్యూహంతో వ్యవహరించకపోవడం వల్లే పోకిరీలు భారీగా తరలివస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కోసారి ఒకరిద్దరు కానిస్టేబుళ్లను స్టంట్లు జరిగే ప్రాంతాల్లో విధుల్లో ఉంచుతున్నారు. దేశ, విదేశాలకు చెందిన ఐటీ సంస్థలు ఉండే చోట తరచూ ఇలాంటివి జరగడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

టీ హబ్ దగ్గర ఎక్కువే: విశాలమైన రోడ్లు, ఇరువైపులా అద్దాల మేడల్లాంటి భవనాలు, దూసుకెళ్లేందుకు అనువైన దారి, వీరిని అడ్డుకోవడానికి చాలీచాలని పోలీసు సిబ్బంది ఇవే ఐటీ కారిడార్లో పోకిరీలు స్టంట్లు వేసేందుకు కారణమవుతున్నాయి. ఐటీ కారిడార్లో ప్రధానంగా టీ హబ్, అరవింద్ గెలాక్సీ మార్గంలో బైక్ స్టంట్లు విపరీతంగా జరుగుతున్నాయి. స్టంట్లు వేసేందుకు పదుల సంఖ్యలో ఆకతాయిలు వస్తుంటే వారిని వీక్షించేందుకు నగరం నలుమూలల నుంచి వందలాది మంది యువత ద్విచక్రవాహనాలు, కార్లలో తరలివస్తున్నారు.

ఇన్స్టాగ్రామ్, ఫేస్​బుక్, యూట్యూబ్​లో రీల్స్, షార్ట్స్ కోసం బైకర్లు స్టంట్లు వేస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి వస్తున్నా స్టంట్లు జరిగే ప్రాంతానికి చేరుకోనే మార్గాల్లో వారాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఆకతాయిలు ఇటువైపు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటే దీనికి కొంతైనా అడ్డుకట్ట పడుతుంది. దీనికి బదులు మెజార్టీ సందర్భాల్లో వందలాది గుమిగూడి స్టంట్లు మొదలయ్యాకే చేరుకోవడం సమస్యకు దారి తీస్తోంది.

నగరం నలుమూలల నుంచి వాహనాలతో వస్తున్నా స్టంట్లు వేసే రహదారులు రెండే ఉన్నాయి. మొత్తం ఐదు మార్గాల గుండా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడే పికెటింగ్ ఏర్పాటు చేసి ఆకతాయిలు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. కేబుల్ బ్రిడ్జి మీదుగా ఐటీసీ కోహినూర్ నుంచి వచ్చే మార్గం, సత్వా నాలెడ్జ్ సిటీ నుంచి వచ్చే మార్గం, ఇమేజ్ టవర్స్, మైహోం స్కై వ్యూ నుంచి వచ్చే మార్గం, రాయదుర్గం నుంచి టీ హబ్ వైపు వచ్చే మార్గాల్లో ఈ రేసింగ్‌లు జరుగుతున్నాయి.

సాధారణంగా వారాంతం వచ్చిందంటే ఐటీ కారిడార్లో రద్దీ తక్కువగా ఉంటుంది. ఉద్యోగులు వేర్వేరు పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ వారాంతాల్లోనే కొందరు ఐటీ ఉద్యోగుల పేరుతో టీహబ్ రోడ్డులోకి వస్తుంటారు. రాత్రి 9 గంటల తర్వాత పికెటింగ్ ఏర్పాటు చేసి ఐటీ కార్డులు పరిశీలించి పంపిస్తే సమస్య కొంత తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విన్యాసాలు చేసే వారు 10 మంది ఉంటే వారిని వీక్షించేందుకు వచ్చే వారు వందలాది మంది ఉంటున్నారు. రహదారులపై ఎక్కడికక్కడ బారికేడింగ్ ఏర్పాటు చేస్తే వాహనాలు వేగంగా వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయి.

ఇప్పటివరకూ బైక్ రేసింగ్‌ల విషయంలో నగరంలో నమోదైన కేసులు 250 కేసులు నమోదు కాగా 156 ద్విచక్రవాహనాలను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో లైక్‌ల కోసం ప్రాణాలు పోయే ప్రమాదకర స్టంట్‌లు చేయకూడదని పలువురు సూచిస్తున్నారు.

బుర్ఖా ధరించి భయపెట్టేలా ఆకతాయిల బైక్​ స్టంట్స్​ - తిక్క కుదిర్చిన పోలీసులు - Two Arrested Performing Bike Stunts

అర్ధరాత్రి దడపుట్టిస్తున్న పోకిరీలు - నడిరోడ్డుపై డేంజరెస్ బైక్ స్టంట్స్​ - BIKE RACING AT HYD IT CORRIDOR

Last Updated : Nov 5, 2024, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.