ETV Bharat / entertainment

10,000 స్క్రీన్స్‌లో 'కంగువా' భారీ రిలీజ్​- సౌత్​లో ఎన్ని థియేటర్లంటే?

రిలీజ్​కు ముందే 'కంగువా' రికార్డ్​!- అందేంటంటే?

Kanguva Theatrical Release In 10000 Screens
Kanguva Theatrical Release In 10000 Screens (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2024, 1:54 PM IST

Updated : Nov 5, 2024, 2:10 PM IST

Kanguva Theatrical Release In 10000 Screens : తమిళ హోరీ సూర్య లీడ్​ రోల్​లో శివ దర్శకత్వంలో రానున్న చిత్రం 'కంగువా'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 14న వరల్డ్​వైడ్​గా రిలీజ్​ కానుంది. తాజాగా ఈ సినిమా విడుదల గురించి ప్రొడ్యూసర్ ధనుంజయ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీ భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10,000 స్క్రీన్స్‌లో ఈ సినిమాను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా రిలీజ్​ కోసం ప్రేక్షకులతో పాటు తాము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపారు.

" 'కంగువా'ను 10వేల స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నాం. వీటిలో చాలా స్క్రీన్లు ఇప్పటికే కన్ఫామ్‌ అయ్యాయి. సౌత్​లో 2500 కంటే ఎక్కువ స్క్రీన్‌లు, నార్త్​లో 3,500 స్క్రీన్లలో ప్రదర్శించునున్నామని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాం. నవంబర్‌ 14న మొత్తం 10 వేల స్క్రీన్‌లలో భారీస్థాయిలో కంగువా ప్రేక్షకుల ముందుకు వస్తుంది" అని నిర్మాత ధనుంజయ్‌ వెల్లడించారు.

వరల్డ్​ వైడ్​గా రూ.1000 కోట్ల వసూళ్లు సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత ధనుంజయ్​ ఇటీవల చెప్పారు. పార్ట్ 2, పార్ట్‌ 3 కథలు కూడా సిద్ధంగా ఉన్నాయన్న నిర్మాత, పార్ట్‌ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్రాణాళిక చేసినట్లు చెప్పారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని తాను నమ్ముతున్నట్లు అన్నారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఈ సినిమాలో అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు.

త్రీడీలోనూ 'కంగువా' బొమ్మ
'కంగువా' త్రీడీలోనూ అలరించనుంది. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు సమాచారం. దిశా పఠానీ హీరోయిన్​గా నటిస్తోంది. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా, జగపతిబాబు, తమిళ కమెడియన్ యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

11,500 స్క్రీన్స్‌లో 'పుష్ప 2'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'పుష్ప: ది రూల్‌'. 'పుష్ప ది రైజ్‌'కు సీక్వెల్‌గా రానున్న ఈ చిత్రం కూడా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను వైరల్డ్​వైడ్​గా 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. భారత్​లో 6,500, ఓవర్సీస్‌లో 5,000 స్క్రీన్స్‌లో ఈ మూవీని ఆడియెన్స్​ ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.

Last Updated : Nov 5, 2024, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.