Parties Changed Leaders Hopes Failed : తెలంగాణలో లోకసభ ఎన్నికల ముందు కొందరు నేతలు సొంత పార్టీని వీడి మరోపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేశారు. ఇంతకుముందు ఉన్న పార్టీపైనే విమర్శనాస్తాలు సంధించారు. కానీ వారిలో చాలా మంది వ్యూహాలు ఫలించలేదు. ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురై, రిజల్ట్స్ తారుమారయ్యాయి.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ, సార్వత్రిక సమరంలోనూ అదే ఉత్సాహాన్ని కనబరచాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఆ దిశగానే ఓవైపు చేరికలు, మరోవైపు పాలనా కార్యకలాపాలు జరిపింది. ఇదిలా ఉంటే విపక్ష భారతీయ జనతా పార్టీ రెండెంకల స్థానామే లక్ష్యంగా తీవ్రంగా శ్రమించింది. ఇందులో సైతం పలు పార్టీల నేతల చేరికలను ఆహ్వానిస్తూ ముందుకు సాగింది.
TG Lok Sabha Results 2024 :ముఖ్యంగా మోదీ మేనియాతో గెట్టక్కాలని తలచింది. అనుకున్నట్టుగానే ఈ రెండు జాతీయ పార్టీలు పదేళ్ల పాటు అధికారంలో ఉండి, ఈదఫా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులతో బేరసారాలు జరిపి, పార్టీలోకి ఆహ్వానించాయి. ఈ మేరకు గులాబీ పార్టీలు చాలా వరకు ముఖ్య నేతలు మొదలుకొని సర్పంచ్ల వరకు ఫిరాయింపులు జరిపారు. అలా బీఆర్ఎస్ను కాదని తమ పార్టీలోకి వచ్చిన పలువురికి జాతీయ పార్టీలు ఎంపీ టిక్కెట్ సైతం కట్టబెట్టాయి. పాపం ఏమిలాభం? చాలా వరకు నేతల ఆశలు గల్లంతయ్యాయి.