Parigi MLA Ram Mohan Reddy Fires on Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగుండదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మాజీమంత్రి హరీశ్‌రావును హెచ్చరించారు. సీఎంను చెడ్డీ గ్యాంగ్ సభ్యుడంటావా అని ప్రశ్నించిన ఆయన, కేసీఆర్ గ్యాంగ్ లీడర్ అయితే కేటీఆర్, కవిత(MLC Kavitha), హరీశ్‌రావులు గ్యాంగ్ సభ్యులని ఆరోపించారు. చెడ్డీ గ్యాంగ్ అర్థరాత్రి దొంగతనాలు చేస్తుందని, కానీ కేసీఆర్ గ్యాంగ్ తెలంగాణ ప్రజలను పట్టపగలు నిలువునా దోచేశారని విమర్శించారు.
కాళేశ్వరంలో హరీశ్‌రావు బాగోతం కూడా బయటపడుతోందని ఆయన కమీషన్‌ల వ్యవహారాన్ని త్వరలోనే కక్కిస్తామన్నారు. సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రంగనాయక సాగర్(Ranganayaka Sagar) దగ్గర పేద రైతులను బెదిరించి 15 ఎకరాల ఫాంహౌజ్ కట్టుకోలేదా అని ప్రశ్నించారు. చిన్న రైతులను భూసేకరణ పేరుతో వేధించి ఫామ్ హౌజ్ కట్టుకోవడానికి సిగ్గుండాలని ఎద్దేవా చేశారు. రైతులపై ప్రేమ ఉన్నట్లు తెగ బాధపడుతున్న హరీశ్‌రావు, బలవంతంగా వారి భూములను గుంజుకున్నప్పుడు రైతులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది - ఆయనను ఎవ్వరూ ఏమీ చేయలేరు : పంచాంగ కర్త - Congress Ugadi Celebrations in TS
"హరీశ్‌రావు మా గౌరవముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెడ్డీ గ్యాంగ్ అని విమర్శించడం చాలా బాధాకరం. కాళేశ్వరం కాంట్రాక్ట్ పెట్టి, కమీషన్లు కొట్టి రంగనాయక సాగర్ దగ్గర 15 ఎకరాల భూమి రైతుల వద్ద బలవంతంగా గుంజుకొని, మీరు ఫాంహౌజ్ కట్టుకున్నారు. మీ ఫాంహౌజ్ వ్యవహారమంతా త్వరలోనే బయటకు తీసుకొస్తున్నాం. మొత్తం కూడా కక్కిస్తామని కూడా హరీశ్‌రావుకు తెలియజేస్తున్నాం." -రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే పరిగి
రేవంత్ రెడ్డి గురించి అడ్డగోలుగా మాట్లాడితే రాష్ట్రంలో తిరగనియ్యం : పరిగి ఎమ్మెల్యే మెదక్‌లో బీఆర్ఎస్ ఓడిన వెంటనే హరీష్‌రావుకు కౌంట్‌డౌన్ మొదలు : కేటీఆర్, హరీశ్‌రావు ఫాంహౌజ్ వ్యవహారాలన్ని బయటకు తీస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే రుణమాఫీ కాలేదని గగ్గోలు పెడుతున్న మీరు, బీఆర్ఎస్ హయాంలో 2018 లో రుణమాఫీ హామీ ఇచ్చి 2023 వరకు చేయనప్పుడు హరీశ్‌రావు కేసీఆర్‌ను(KCR) ఎందుకు నిలదీయలేదన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని మాజీమంత్రి కలలు కంటున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో గులాబీ పార్టీ ఉండదని, ఒకవేళ ఆ పార్టీ ఉన్నా అందులో హరీశ్‌రావు ఉండడని రామ్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు.
MLA Ram Mohan Warning to Harish Rao :మెదక్‌లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత హరీశ్‌రావుకు ఆ పార్టీలో కౌంట్‌డౌన్ మొదలవుతుందన్నారు. రేవంత్ రెడ్డిపైన విమర్శలు చేయడమే పనిగా మాజీమంత్రి తిరుగుతున్నారని, తానెంత గొంతు చించుకున్నా ఏం ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్(Congress Govt) వెంట ఉన్నారని, హామీలు అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి వైపు నిలబడతారని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన ఎవరైనా అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని, రాష్ట్రంలో అలాంటివారిని తిరగనియ్యరని స్పష్టంగా హెచ్చరిస్తున్నట్లు రామ్మోహన్ రెడ్డి తెలిపారు.
పీసీసీ అధ్యక్ష పదవి నేను కోరుకోవడం తప్పు కాదు : జగ్గారెడ్డి - Jagga Reddy Comments on KCR
కొడంగల్‌లో కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు కుట్ర - నాపై కక్షగట్టి దుష్ప్రచారం : సీఎం రేవంత్ - LOK SABHA ELECTION 2024