తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఎన్నికల ప్రచారం వయా సోషల్​ మీడియా - ఫేస్​బుక్, యూట్యూబ్ కాదేది ప్రచారానికి అనర్హం - Election Campaign In Social media

MP Candidates Election Campaign On Social Media : సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారంపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మండే ఎండలతో పలువురు అభ్యర్థులు నేరుగా ఓటర్లని కలుసుకోలేకపోతున్నారు. ఉదయం వేళ వాకర్స్‌, కూరగాయల మార్కెట్లలో తిరుగుతూ కొంత ప్రచారం చేస్తున్నారు. మరింతగా ప్రజలకు చేరువయ్యేందుకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంచేస్తూ ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. అందుకు ప్రస్తుతం నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటున్న రీల్స్‌ను విరివిగా వాడుకుంటున్నారు. ఆయా సందర్భాలకు తగ్గట్టు సినిమా పాటలు వేసి సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగించుకుంటున్నారు.

Etv Bharat
MP Candidates Election Campaign On Social Media (MP Candidates Election Campaign On Social Media)

By ETV Bharat Telangana Team

Published : May 4, 2024, 10:30 PM IST

ఎన్నికల ప్రచారం వయా సోషల్​ మీడియా- ఫేస్​బుక్, యూట్యూబ్ కాదేది ప్రచారానికి అనర్హం (ETV BHARAT)

MP Candidates Election Campaign On Social Media : రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడు ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఫలితంగా ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు ఓటర్లను నేరుగా కలుసుకోవడం ఇబ్బందిగా మారింది. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకొచ్చి ప్రచారం చేస్తున్నారు. సమయం మించిపోతుండటంతో సాంకేతికతను అందిపుచ్చుకొని సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. వీటి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేరువ అవుతున్నారు. ఎక్కువగా ప్రజాదరణ పొందిన వీడియోల్ని అనుకరిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

Parties Election Campaign Through Social Media :ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వరంగల్ మానుకోట పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు డిజిటల్ మీడియాని విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. కార్యాలయాల్లో ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగాలు ఏర్పాటు చేసి ప్రచారంలో వైవిధ్యాన్ని చూపేందుకు యత్నిస్తున్నారు. చిన్న పండుగ వచ్చినా ఏదైనా కార్యక్రమం జరిగినా వాటిని ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటున్నారు.

సమయం లేదు మిత్రమా - లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం చెమటోడ్చుతోన్న అభ్యర్థులు - Telangana Election Campaign 2024

BRS MP Candidate Election Campaign :కాంగ్రెస్‌ వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్ధి కడియం కావ్య సామాజిక మాధ్యమ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వకీల్‌సాబ్‌లోని 'మగువా మగువా' పాటపై రీల్‌ చేయించి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్​ ప్రత్యేకంగా సోషల్‌ మీడియా విభాగం ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నారు. సమావేశాలు, ర్యాలీలు, బహిరంగ సభల్లో నేతల ప్రసంగాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గ్రామ, మండలస్థాయిల్లో ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందులో పొందుపరుస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ప్రచారంలో తనదైన ముద్ర వేస్తున్నారు.

సోషల్ మీడియాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం :మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్​ ఫేస్‌బుక్‌, ఎక్స్‌ ఖాతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రంజాన్, ఉగాది వేళ శుభాకాంక్షలు తెలిపిన దృశ్యాలకు సినిమా డైలాగ్‌లు జోడించి ప్రజల్లోకి తీసుకె‌ళ్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్‌ కవిత, బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్‌ ఇదే ట్రెండ్‌ ఫాలో అవుతూ ఓటర్లను ఆకట్టుకుంటునేందుకు యత్నిస్తున్నారు.

గెలుపే లక్ష్యంగా నేతల మాటల తూటాలు - రణరంగంలా తెలంగాణ రాజకీయం - TS LOK SABHA ELECTION CAMPAIGN 2024

రాష్ట్రంలో రాజకీయ వే"ఢీ"- క్లైమాక్స్‌కు చేరుకున్న ఎన్నికల ప్రచారం - lok sabha elections 2024

ABOUT THE AUTHOR

...view details