తెలంగాణ

telangana

ETV Bharat / politics

'నా పేరును రాజకీయంగా ఉపయోగించవద్దు' - మోహన్ బాబు వార్నింగ్ - Mohan Babu Political Warning Tweet

Mohan Babu Political Warning Tweet : రాజకీయంగా తన పేరును ఉపయోగించుకుంటున్నారని, అలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని ప్రముఖ సినీనటుడు మంచు మోహన్ బాబు హెచ్చరించారు. తన పేరును అనవసరంగా వాడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ ఎక్స్ వేదికగా మోహన్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు.

Mohan Babu Political Warning Tweet
Mohan Babu Mass Warning to Political

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2024, 7:15 PM IST

Mohan Babu Political Warning Tweet :తన పేరును కొందరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని, అలాంటి చర్యలను అస్సలు ఉపేక్షించనని ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్(Twitter) వేదికగా బహిరంగ లేఖ విడుదల చేసిన మోహన్ బాబు, తన పేరును అనవసరంగా వాడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఏ పార్టీ వారైనా తన పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

Mohan Babu Open Letter to Politics : అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నామని, ఎవరి అభిప్రాయం వారిదని లేఖలో మోహన్ బాబు పేర్కొన్నారు. చేతనైతే నలుగురికి సాయపడటంలో దృష్టి పెట్టాలని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి(Political Party), వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధ కలిగిస్తుందన్నారు. అయితే మోహన్ బాబు ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి ఈ లేఖ రాశారనేది స్పష్టంగా చెప్పకపోవడంతో సామాజిక మాద్యమాల్లో ప్రస్తుతం ఈ లేఖపై తీవ్ర చర్చ జరుగుతోంది.

ABOUT THE AUTHOR

...view details