తెలంగాణ

telangana

ETV Bharat / politics

లీగల్​ నోటీసులు పంపి కేటీఆర్​ బెదిరించాలని చూస్తున్నారు : ఎమ్మెల్యే యెన్నం - Phone Tapping Case Issue - PHONE TAPPING CASE ISSUE

MLA Yennam Srinivas Reddy Counter to KTR on Phone Tapping Issue : విచారణ చేయాలని అడుగుతుంటే పరువు తీశామని కేటీఆర్​ అంటున్నారని కాంగ్రెస్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. బాధితుడిగా తాను ఫిర్యాదు చేశానని, ఆధారాలు ఉన్నందుకే పోలీసు అధికారులను విచారిస్తున్నారని తెలిపారు. తాను కేటీఆర్​ స్థానంలో ఉంటే ఫోన్​ ట్యాపింగ్​లో తన పాత్ర లేదని అధికారులకు లేఖ రాస్తానని చెప్పారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

MLA Yennam Srinivas Reddy Counter to KTR on Phone Tapping Issue
లీగల్​ నోటీసులు పంపి కేటీఆర్​ బెదిరించాలని చూస్తున్నారు : ఎమ్మెల్యే యెన్నం

By ETV Bharat Telangana Team

Published : Apr 4, 2024, 4:17 PM IST

MLA Yennam Srinivas Reddy Counter to KTR on Phone Tapping Issue : ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో తనకు లీగల్​ నోటీసులు పంపి కేటీఆర్​ బెదిరించాలని చూస్తున్నారని మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. కేటీఆర్​ తనతో పాటు మరో ఇద్దరికీ లీగల్​ నోటీసులు పంపారని అన్నారు. అసలు ఆయనకు లాపై, అడ్మినిస్ట్రేషన్​పై అవగాహన ఉందా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఫోన్​ ట్యాపింగ్​(Phone Tapping Case)పై వరుస కథనాలు వస్తున్నాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి గుర్తు చేశారు. దానిపై తాము కూడా తమ ఫోన్​ ట్యాప్​ అయినట్లు డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. ఇన్వెస్టిగేషన్​ జర్నలిజంపై కేటీఆర్​కు ఏం తెలుసు, బ్లాక్​ మెయిల్​ బెదిరింపులు తప్ప అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తనకు లీగల్​ నోటీసులు(KTR Legal Notice) ఇవ్వడానికి ఆస్కారం ఏముందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి కేటీఆర్​ను ఉద్దేశించి ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ జరుగుతున్నప్పుడు లీగల్​ నోటీసులు ఇస్తారా అంటూ ధ్వజమెత్తారు. ఫామ్​ హౌస్​లో ఒకరు, గెస్ట్​ హౌస్​లో ఇంకొకరు ఉండి పాలన సాగించారని, గత పదేళ్ల పాలనపై విమర్శలు చేశారు. అడ్డిమారి గుడ్డి దెబ్బల పాలన సాగినట్లుందని ఎద్దేవా చేశారు.

హార్డ్​ డిస్క్​లు ధ్వంసం చేసి మూసీ నదిలో పడేసి - ఫోన్​ ట్యాపింగ్​ కేసులో మరో ట్విస్ట్​!

Phone Tapping Case in Telangana :పోలీసు ఆఫీసర్లను జైల్లో ఎందుకు పెడతారు ఆధారాలు ఉంటేనే కదా అంటూ యెన్నం శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. కేటీఆర్​ ప్లేస్​లో తాను ఉంటే డీజీపీకి లేఖరాసే వాడిని, నిస్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరేవాడినని అన్నారు. లీగల్​ నోటీసులు పంపి బెదిరించాలని చూస్తున్నారని కేటీఆర్​ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టాస్క్​ఫోర్స్​ వాహనాల్లో డబ్బులను తరలించినట్లు వార్తలు కూడా వచ్చాయని గుర్తు చేశారు. మేనేజ్​మెంట్​ కోటాలో వచ్చిన కేటీఆర్​కు ఏం తెలుసునని దుయ్యబట్టారు.

హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్​ చేసినట్లు కథనాలు : అధికార దుర్వినియోగం చేసినందుకు 39 మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను డిస్​ క్వాలిఫై చెయ్యాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి పేర్కొన్నారు. అసలు లీగల్ ​నోటీసులు సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) కేటీఆర్​కు ఇవ్వాలని ఎందుకంటే దిల్లీకి కప్పం కడుతున్నారని అనే ఆరోపణలు చేసినందుకు అని హెచ్చరించారు. ఇతర పార్టీ నేతల ఫోన్​లు ట్యాప్​ చేయడమే కాదు సొంత ఇంటి వాళ్ల ఫోన్లు కూడా ట్యాప్​ చేయలేదా అంటూ ప్రశ్నించారు. దీనికి కూడా నోటీసులు ఇస్తే ఇచ్చేయ్​ అంటూ హితవు పలికారు. ఫోన్​ ట్యాపింగ్​ అనేది సమాజ వ్యతిరేక శక్తులపై చేస్తారని కానీ వ్యక్తుల ఫోన్లపై కాదన్నారు. హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్​ చేసినట్లు కథనాలు వస్తున్నాయని వాటి సంగతి ఏంటని కేటీఆర్​ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి అడిగారు.

టెలిగ్రాఫ్​ చట్టాన్ని ఉల్లంఘించి ఉంటే చర్యలు తప్పవు - ఫోన్​ ట్యాపింగ్​పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ నేతలు, మీడియా సంస్థలకు కేటీఆర్‌ లీగల్ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details