తెలంగాణ

telangana

ETV Bharat / politics

పాడి వర్సెస్ గాంధీ : నేనే మీ ఇంటికి వస్తా - నీకు తట్టుకునే దమ్ముందా? : అరికెపూడి గాంధీ - Padi Kaushik Challenge To Arekapudi

Padi Kaushik Reddy Challenge To Arekapudi : ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య సవాళ్ల పర్వం నడుస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరి ఇళ్ల ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

MLA Padi Kaushik Reddy Challenge To Arekapudi Gandhi
MLA Padi Kaushik Reddy Challenge To Arekapudi Gandhi (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 11:02 AM IST

Updated : Sep 13, 2024, 3:14 PM IST

MLA Padi Kaushik Reddy Challenge To Arekapudi Gandhi :బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే మధ్య సవాల్ దుమారం రేపుతుంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. అరెకపూడి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానని ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్​ రెడ్డి సవాల్ విసిరారు. దాన్ని స్వీకరిస్తున్నట్లు అరెకపూడి గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్ ​రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొండాపూర్​లోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌గా నియమిస్తూ ఇటీవల శాసన సభాపతి నిర్ణయించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్‌ పదవి ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే అరెకపూడి ఇంటికి వెళ్తానని, బీఆర్ఎస్ కండువా కప్పుతానని సవాల్‌ విసిరారు. దీంతో ఎమ్మెల్యే అరెకపూడి స్పందించారు.

ప్రభుత్వంపై హరీశ్​రావు విషప్రచారాలు మానుకోవాలి : విప్ ఆది శ్రీనివాస్ - VIP Aadi Srinivas Slams Harishrao

బాత్రూమ్​లో ఉండి డీలింగ్​లు నడిపే ప్రతి ఒక్కడూ ఇవాళ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ ఇంటికొస్తా ఇంటి మీద జెండా ఎగరేస్తా అంటే ఖాళీగా ఉన్నామా అని అన్నారు. కేసీఆర్ లాంటి పెద్ద మనుషులు అలాంటి కామెంట్స్ చేస్తే స్వాగతించేవాడినన్న ఆయన, తనతోటి శాసన సభ మిత్రులు అడిగినా బదులిచ్చేవాడినని తెలిపారు. ఇలాంటి వారు నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు.

"నన్ను గెలిపించకుంటే చచ్చిపోతా అని భయపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన ఇలాంటి వారికి నా గురించి మాట్లాడే అర్హత లేదు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంలో ప్రజలు నన్ను మూడుసార్లు గెలిపించారు. వారికి నేను సమాధానం ఇస్తా, కానీ ఇలాంటి బ్రోకర్లకు, లోఫర్లకు, చీటర్లకు నేను జవాబు చెప్పే అవసరం లేదు. ఎమ్మెల్యేల ఫిరాయింపులో దిల్లీ దాక చర్చలు చేసిన నీకు, నా గురించి మాట్లాడే అర్హత లేదు. నేనే మీ ఇంటికి వస్తా. తట్టుకునే దమ్ముందా" - అరికెపుడి గాంధీ, ఎమ్మెల్యే

'నా ఫోన్​ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్​ చేస్తోంది' - ఎమ్మెల్యే కౌశిక్​ రెడ్డి సంచలన కామెంట్స్​ - MLA Kaushik Reddy phone tapping

మీ రాజకీయాల కోసం కుటుంబ బంధాల మధ్య చిచ్చుపెట్టారు : హరీశ్​రావు - Harish Rao sensational comments

Last Updated : Sep 13, 2024, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details