తెలంగాణ

telangana

ETV Bharat / politics

వ్యవసాయశాఖ కమిషనరేట్​లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ - లేటుగా వచ్చిన ఉద్యోగులపై అసహనం - MINISTER TUMMALA ON GOVT OFFICERS - MINISTER TUMMALA ON GOVT OFFICERS

Minister Tummala Inspection At Agriculture Commissionerate : హైదరాబాద్​లోని వ్యవసాయశాఖ కమిషనరేట్ కార్యాలయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్దేశిత సమయానికి కొంతమంది ఉద్యోగులే హజరుకావడంతో అసహనం వ్యక్తం చేశారు.

Minister Tummala Inspection in Agriculture Commissinarate
Minister Tummala Inspection in Agriculture Commissinarate (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 1:56 PM IST

Updated : Jul 4, 2024, 2:30 PM IST

Minister Tummala Sudden Inspection in Agriculture Commissionerate :ప్రభుత్వ కార్యాలయాల్లో మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఉద్యోగులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అసలు డ్యూటీకి హాజరవుతున్నారా? వారి పనితీరు ఎలా ఉంది అనే దానిపై వరుస తనిఖీలు చేస్తూ ఆరా తీస్తున్నారు. ఉద్యోగులు టైమ్​కి రాకపోయినా, పని తీరు సరిగ్గా లేకపోయినా నివేదికలు అడుగుతున్నారు. కొన్నిసార్లు అక్కడికక్కడే అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు.

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి రారనే ప్రచారం ప్రజల్లో ఉంది. అది నిజమని నిరూపించేలా చాలా వరకు ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర మంత్రులు వరుసగా తనిఖీలు చేస్తూ వారిలో జవాబుదారీతనాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నిర్లక్ష్యం వహించే ఉద్యోగులకు భయం పుట్టేలా ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

మంత్రి ఆకస్మిక తనిఖీ :తాజాగా హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయాన్ని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. మంత్రిని చూసి ఉద్యోగులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. నిర్దేశిత సమయానికి కొంత మంది మాత్రమే ఉద్యోగులు హాజరవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎంత మంది ఉద్యోగులు హాజరయ్యారంటూ అటెండెన్స్ బుక్ చూడాలంటూ సూచించారు. ఆ సమయంలో వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయ్‌కుమార్ ఉన్నారు. ఆయనతో కొద్దిసేపు మంత్రి మాట్లాడారు.

నాసిరకం, నకిలీ విత్తనాలు రైతులకు ఇవ్వాలనుకునే వారిపై కఠిన చర్యలు : మంత్రి తుమ్మల - Tummala review on Seed Availability

ఇక నుంచి తప్పకుండా అందరూ ఉద్యోగులు సమయానికి విధి నిర్వహణకు హాజరవ్వాలని ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చించారు. వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది విధులకు నిర్దేశిత సమయానికి హాజకాకపోవడంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డాక్టర్ బి.గోపికి మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ కార్యాలయంలో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై ఎన్సీడీసీ అధికారులతో మంత్రి చర్చించారు. పనిలో మంచి పనితీరు కనబర్చిన సహకార సంఘాలకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్యపై సమగ్ర విచారణ - అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

Last Updated : Jul 4, 2024, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details