తెలంగాణ

telangana

ETV Bharat / politics

'బీఆర్​ఎస్​ వదిలిన అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం' - హరీశ్‌రావు, కేటీఆర్‌లకు మంత్రి శ్రీధర్​ బాబు కౌంటర్ - Sridhar Babu Counter to BRS Leaders - SRIDHAR BABU COUNTER TO BRS LEADERS

Minister Sridhar Babu Counter to BRS Leaders : ఉద్యోగాల ప్రకటన, ఆసరా ఫించన్లపై మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఖండించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిమాటకు కట్టుబడి ఉన్నామన్న శ్రీధర్‌బాబు, బీఆర్ఎస్​ వదిలివెళ్లిన ఆర్ధిక వ్యవస్థను సరిదిద్దుతున్నట్లు వివరించారు.

Minister Sridhar Babu Fires on BRS Party
Minister Sridhar Babu Counter to Harish Rao and KTR (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 17, 2024, 7:40 PM IST

Minister Sridhar Babu Counter to Harish Rao and KTR : రాష్ట్రంలో ఉద్యోగాల ప్రకటన, ఆసరా ఫించన్లపై బీఆర్​ఎస్​ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకుగానూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌ ఇచ్చారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. గత పాలనలో బీఆర్​ఎస్​ వదిలిన అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నట్లు వివరించారు.

ఏపీ కాదు తెలంగాణ ప్రజల ఆలోచనలు అమలు చేస్తాం : హామీల అమలులో ఆంధ్రప్రదేశ్​ సీఎం చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటే, హరీశ్​రావు పరిస్థితి ఏంటో అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. తాము తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తాం కానీ ఏపీ ఆలోచనలు కాదన్న శ్రీధర్‌బాబు, త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని వెల్లడించారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్ -1 పరీక్ష కాంగ్రెస్‌ సర్కారు మాత్రమే నిర్వహించిందని గుర్తుచేశారు.

Congress Govt Serious about Peace and Security : మూడు నెలలు పరిపాలన చేయగానే ఎలక్షన్ కోడ్ వచ్చిందని, ఇప్పుడు కోడ్ ముగిసినందున హామీలు ఒకటికొకటి అమలు చేస్తామన్నారు. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీశ్‌కు లేదని పునరుద్ఘాటించారు.

బీఆర్​ఎస్ హయాంలో గుర్రాలతో ఆశా వర్కర్లను తొక్కించారని దుయ్యబట్టారు. పెద్దపల్లిలో జరిగిన ఘటనపై విచారణ జరుగుతుందన్న శ్రీధర్​బాబు, శాంతి భద్రత విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని తెలిపారు. మతఘర్షణల వెనక ఎవరి హస్తం ఉన్నా ఉక్కుపాదంతో అణచివేస్తామని మంత్రి స్పష్టంచేశారు.

MLC Balmoori Venkat Fires on BRS : యువతను రెచ్చగొట్టి బీఆర్​ఎస్​ నాయకత్వం రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని కాంగ్రెస్‌ ఆక్షేపించింది. మాజీ మంత్రి హరీశ్‌రావు పరీక్షలపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్​ పాలనలో ఆ పార్టీ నేతలు విద్యార్ధి, నిరుద్యోగులకు ఎపుడూ అందుబాటులో లేరని విమర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక జీవో 55 రద్దు చేశామని, 11 వేలకు డీఎస్సీ పోస్టులు పెంచామని గుర్తుచేశారు.

పదేళ్లు అధికారంలో ఉండి నిరుద్యోగులను విస్మరించిన గులాబీ నేతలు ఇపుడు వారి పక్షాన మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బల్మూరి వెంకట్‌ ఆరోపించారు. ఆర్నెళ్ల కాంగ్రెస్‌ పాలనపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని హరీశ్‌రావుకు ఎమ్మెల్సీ బల్మూరి సవాల్‌ విసిరారు. హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరేవేర్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని వెంకట్‌ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఇక ఏటా జాబ్‌ క్యాలెండర్‌ - ప్రామాణిక ముసాయిదా సిద్ధం చేస్తున్న టీఎస్‌పీఎస్సీ

ABOUT THE AUTHOR

...view details