Minister Ponnam Prabhakar Press Meet : కాంగ్రెస్ విజయం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి అవసరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మార్పు కోరుకుని మీరు తెచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేయాలంటే కాంగ్రెస్‌ను ఎంపీ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరుకున్నారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని పిల్లి శాపనార్ధాలు పెట్టిన వాళ్లకు ఓటర్లు సమాధానం చెప్పే తీర్పునని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఫ్రీ బస్సు, 200 యూనిట్ల కరెంటు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నామని చెప్పారు. కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు, కొత్త ఫించన్లు, ఇప్పుడున్న ఫించన్లు పెంచుతామని మాటిచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, మహిళలకు రూ.2500 అమలు చేస్తామని అన్నారు.
మతతత్వంతో గెలవాలని చూస్తోంది : గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల దగ్గరున్న సమస్యలన్నీ తీర్చి సాగునీరందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశం సంక్షిష్ట దశలో భారదేశం నా మాతృదేశమని ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. పైకి జై శ్రీరామ్ అంటూనే లోపల రిజర్వేషన్లకు రామ్ రామ్ చెప్పేందుకు బీజేపీ వాళ్లు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి మతతత్వంతో గెలవాలని బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు.
'కరీంనగర్లో మేమంతా ఐక్యంగా పని చేశాం. మా గెలుపు తథ్యం. కరీంనగర్ నుంచి మాకు బలాన్ని ఇవ్వండి. ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. సిరిసిల్ల సంక్షోభంలో పడినా టెక్స్టైల్ జోన్‌ను వరంగల్‌కు తరలించినా అప్పటి ఎంపీ వినోద్ పట్టించుకోలేదు. బండి సంజయ్ వివాదాల్లో ప్రాచుర్యం పొందినా ఎంపీగా కరీంనగర్‌కు ఏం చేయలేదు. మీరే కాదు మేము పక్కా, కచ్చా లోకల్' అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.