Minister Ponnam Prabhakar Fires on KTR :బీఆర్‌ఎస్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఏం న్యాయం చేశారో చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్‌ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూటిగా(Ponnam Question to KTR) ప్రశ్నించారు. మీరే అన్ని ముఖ్యమైన పదవులు చేపట్టి, కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బలహీన వర్గాలకు ఏం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. బలహీన వర్గాలకు(బీసీలు) న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 16 కులాలకు కార్పొరేషన్‌లు కేటాయించామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే అడిగే స్వేచ్ఛ తమకుందని తెలిపారు. 23 ఏళ్లలో బీఆర్‌ఎస్ పార్టీలో బలహీన వర్గాలకు ఏ ఒక్కరికీ న్యాయం చేయలేదని పేర్కొన్నారు. పార్టీ పదవులైనా బీసీలకు ఇచ్చి, కేటీఆర్(KTR) తమను విమర్శించాలని హితవు పలికారు. బీఆర్‌ఎస్ పాలననలో చేసిన మోసాలు అన్ని బయటకు వస్తున్నాయని వివరించారు.
నా ఫోన్ కాల్ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకి పంపించారు - ఆర్డీవోపై మంత్రి పొన్నం ఆరోపణ
Lok Sabha Election 2024 : బీజేపీ బలహీన వర్గాల వ్యక్తిని అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్‌రెడ్డికి ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 'కిషన్‌రెడ్డి, మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని అంటున్నారు. అలాగే కొంతమంది బీజేపీ నేతలు సైతం ఇదే ధోరణిలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒకసారి కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడండి, ఏం జరుగుతుందో మీరే చూస్తారు' అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడండి - ఏం జరుగుతుందో మీరే చూస్తారు : మంత్రి పొన్నం "బలహీన వర్గాల శాఖ మంత్రిగా, బలహీన వర్గాల నాయకుడిగా కేటీఆర్‌కు ఒకటే ఒకటి సూటి ప్రశ్న. 23 ఏళ్ల కిందట పార్టీ పెట్టిన దగ్గర నుంచి నిన్నటి వరకు ఒక బలహీన వర్గాల వ్యక్తికి అధ్యక్ష పదవిని ఎందుకు ఇవ్వలేదు. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అయినా సరే అధ్యక్ష పదవి వేరే వ్యక్తికి ఇవ్వవచ్చు కదా. ముఖ్యమైన పదవులు అన్నింటిలోనూ మీరే ఉండి, ఇంకా అంటున్నారు అంటే దయ్యాలు వేదాలు వల్లినట్లు ఉంది. ఈ ఎన్నికలకు ముందు బీసీలకు ఏదైనా పదవి ఇవ్వండి. లేకపోతే మీరు ఏం చెప్పినా అది నడవదు. బీసీలకు ఈ పదేళ్లలో ఏం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా? బీజేపీ కూడా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని అధ్యక్ష పదవి నుంచి దించేశారు. బీసీలకు న్యాయం చేయాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం."- పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
'కోమటిరెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు - బీజేపీ గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది'
కాంగ్రెస్లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి