Minister Ponnam Fires On Modi govt : కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు నియంతృత్వం వస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా వేములవాడ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు.
Ponnam Prabhakar Comments On BJP : ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికితీసి, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని గతంలో చెప్పిన ప్రధాని మోదీ, ఏ ఒక్కరి ఖాతాల్లోనైనా వేశారా? అని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం, చేయలేదని పొన్నం విమర్శించారు. నల్ల చట్టాలపై రైతులు నిరసనలు తెలుపుతున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును మోదీ అవమానపరిచారన్నారు. అర్ధరాత్రి తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారని మాట్లాడి అమరవీరులను అవమాన పరిచారని అన్నారు.
Minister Ponnam Fires On Bandi sanjay :బండి సంజయ్‌పై మంత్రి పొన్నం తీవ్ర విమర్శలు చేశారు. తల్లీబిడ్డ గురించి సంజయ్ మాట్లాడారని చెప్పారు. తల్లికి బిడ్డ పుడితే నర్స్ చెబితేనే తెలుస్తుంది అన్న వ్యక్తి ప్రజలకు అవసరమా? అన్నారు. బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదన్నారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అత్తగారి ఊరు ఉందని చెప్పి నిర్వాసితులకు హామీ ఇచ్చి నెరవేర్చని అసమర్థుడన్నారు.