Minister Nadendla Manohar on free Gas Cylinder Scheme:సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్దిదారులకు అందించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు రూ.141 కోట్ల 15 లక్షల 81 వేల నగదును లబ్దీదారుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 1.55 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని తెలపారు. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ,రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపారు.
దీపం-2 పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా సమర్థంగా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. సిలిండర్ డెలివరీ అయ్యాకే సబ్సిడీ మొత్తం అందిస్తున్నట్లు తెలిపారు. 3 విడతల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించామని స్పష్టం చేశారు. ఈ పథకంపై వైఎస్సార్సీపీ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి నాదెండ్ల మండిపడ్డారు.