Mahabubabad MP Candidates : గిరిపుత్రుల ఖిల్లాగా పిలిచే మహబూబాబాద్ పార్లమెంటు(Parliament) నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఎన్నికల షెడ్యూల్(Election Schedule) వెలువకడముందే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఖరారైయ్యాయి. కాంగ్రెస్ నుంచి మరోసారి కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ బరిలో నిలిచి, అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత మరోసారి పోటీకి నిలిచారు. బీజేపీ ఇంకా తన అభ్యర్థిని అధికారికంగా వెల్లడించలేదు.
కమలం గూటిలో చేరనున్న సీతారాం నాయక్
శుక్రవారం వరంగల్ పర్యటనలో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుకిషన్‌రెడ్డిబీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అనుచరులు, మద్దతుదారులతో చర్చించిన సీతారాంనాయక్ కమలం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ దిల్లీలో బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. సీతారాంనాయక్ చేరికతో మహబూబాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన పేరు లాంఛనం కానుంది. ఇక్కడి నుంచి పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న హుస్సేన్‌నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమించడంతో సీతారాంనాయక్‌కు మార్గం సుగుమమైంది.
తెలంగాణ అభివృద్ధి కొరకు ప్రధాని నిధులు మంజూరు చేయడం హర్షనీయం : కిషన్ రెడ్డి
Mahabubabad Political Background :2009 పార్లమెంట్ పునర్విభజన చట్టం ప్రకారం మహబూబాబాద్ లోక్‌సభనియోజకవర్గం(Lok Sabha constituency) ఏర్పడింది. అంతకు పూర్వం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో అంతర్భాగంగా ఈ ప్రాంతం ఉండేది. ST రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన మహబూబాబాద్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాలతో ఈ పార్లమెంటరీ నియోజకవర్గం ఏర్పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన బలరాం నాయక్. 2009లో తొలిసారి ఇక్కడి నుంచే పోటీచేసి, ఎంపీగా(MP) విజయం సాధించారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో కేంద్ర సామాజిక , సాధికారత, న్యాయశాఖ సహాయమంత్రిగా పని చేశారు. 2014 లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ చేతిలో, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన మాలోత్ కవిత చేతిలో బలరాంనాయక్ ఓడిపోయారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచార స్పీడు పెంచిన బీజేపీ - అమిత్ షా రాకతో కొత్త జోష్!