Karnataka Valmiki Scam:కర్ణాటక వాల్మీకీ స్కామ్ డబ్బులనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మే 14న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వాడిందని ఈ విషయంలో తాము చెప్పిందే నిజమైందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వాల్మీకి స్కామ్ పై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. కర్ణాటకలోని గిరిజనుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కుంభకోణంలో కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి బి.నాగేంద్ర కీలక సూత్రధారి అని ఈడీ ఛార్జ్‌షీట్‌లో నిర్ధారించిందని కేటీఆర్ పేర్కొన్నారు. రూ. 187 కోట్ల రూపాయలు ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతులమీదుగా దారి మళ్లించి, ఆ సొమ్మును తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మే 14న జరిగిన లోక్‌సభ ఎన్నికల కోసం ఉపయోగించిందని ఆరోపించారు.
KTR Tweet Today :వాల్మీకి స్కామ్‌లో ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బిల్డర్ అని ఆరోపించారు. తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్ నేతలతో సత్యనారాయణ వర్మకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని అన్నారు. వ్యాపారాల్లోనూ సత్యనారాయణ వర్మ ఇక్కడి కాంగ్రెస్ నేతలు భాగస్వాములుగా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇంకా చాలామంది కాంగ్రెస్ పెద్దలు ఉన్నారనేది నిర్వివాదమని తెలిపారు. దర్యాప్తు సంస్థలు వాల్మీకీ స్కామ్ గురించి నిజాలు నిగ్గుతేల్చాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
'రూ.5 లక్షలు కాదు రూ. 25 లక్షలు ఇవ్వాలి' - వరద బాధితుల నష్టపరిహారంపై కేటీఆర్ ట్వీట్ - KTR Tweet Latest
KTR Fires On Govt :మరోవైపుసిర్పూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర వసతి గృహంలో కేవలం 2 రోజుల్లోనే 35 మంది విద్యార్థులు జ్వరాల బారిన పడటం బాధ కలిగిస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రెసిడెన్షియల్ స్కూళ్ల సంక్షోభాల పరంపరలో ఇది మరో ఆందోళనకరమైన సంఘటన అని విమర్శించారు. కోదాడ నుంచి ఆసిఫాబాద్ వరకు విద్యార్థులను సీఎం రేవంత్‌రెడ్డి మౌనంగా ఉండి నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కువ మంది విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనారోగ్యంతో ఉన్న విద్యార్థులను వారి తల్లిదండ్రులతో పంపడం బాధ్యాతారాహిత్యం, సమస్యను పరిష్కరించలేని చర్య తప్ప మరోటి కాదని అభిప్రాయపడ్డారు. వారందరికీ వెంటనే వైద్యం అందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రిని కోరుతున్నానని అన్నారు. బాధ్యాతాయుతమైన ప్రభుత్వంలా వ్యవహరిస్తారని ఆశిస్తున్నానని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఓ వైపు హైడ్రా నోటీసులు, మరో వైపు పేదోడి ఇళ్ల కూల్చివేతలు :బీఆర్ఎస్ ప్రవేశ పెట్టిన పథకాలు, పేదోడి బతుకు ఇందిరమ్మ రాజ్యంలో ఆగమాగం అవుతున్నాయని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తాము ప్రకటించిన గృహజ్యోతి పథకానికి తూట్లు పొడిచిన కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ అమలు చేసిన 20వేల లీటర్ల ఉచిత మంచి నీరు పథకంపై కుట్రలు చెయ్యడం సిగ్గు చేటన్నారు. ఒక వైపు రుణమాఫీ కాలేదు, డబ్బులు కట్టండి అని రైతులకు నోటీసులు, మరో వైపు నిరుపేదల ఇండ్లకు హైడ్రా నోటీసులు, ఇప్పుడు నల్ల బిల్లు అంటూ మండిపడ్డారు. ఉన్న ఒక్క గూటినీ బుల్‌డోజర్ ప్రభుత్వం కూల్చివేస్తే, కడుపుమండి, కన్నీళ్లతో కిరోసిన్ పోసుకున్నందుకు కేసులు పెడతారా అని కేటీఆర్ ప్రశ్నించారు.
'ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మికులు పరిహారం కోసం ఇంకెంతకాలం ఎదురు చూడాలి' - KTR Latest Tweets
'8 నెలల్లో విద్యను అస్తవ్యస్తం చేసిన కాంగ్రెస్ - సీఎం రేవంత్‌కు విద్యా వ్యవస్థపై పట్టింపే లేదు' - KTR on Congress about Schools