తెలంగాణ

telangana

ETV Bharat / politics

రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా! - ఎక్స్​లో ప్రకటించిన కేటీఆర్ - KTR PADAYATRA

కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్న మాజీ మంత్రి - ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం తీరుపై మండిపాటు - త్వరలో పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడి

KTR SLAMS CM REVANTH REDDY
BRS PARTY WORKING PRESIDENT KTR (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2024, 3:34 PM IST

KTR On Telangana Former Problems : పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్​లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్​లో నిర్వహించిన ఆస్క్ కేటీఆర్​(#askKTR)లో కొంత మంది పాదయాత్రపై ఆయన అభిప్రాయాన్ని కోరారు. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు దేశంలోని అనేక పార్టీల నేతలు, పార్టీ అధ్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారని, మీరెప్పుడు చేస్తారని కేటీఆర్​ను అడిగారు. వాటికి స్పందించిన కేటీఆర్ కచ్చితంగా పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు.

పాదయాత్ర చేయాలని అందరూ కోరుతున్నారని ఆ దిశగా తనను సంసిద్ధుణ్ని చేసుకోనివ్వండని ఆయన తెలిపారు. కాంగ్రెస్ దళారీ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని కేటీఆర్ ఆరోపించారు. పంటకొనుగోళ్లు, అకాల వర్షాలకు ధాన్యం తడవడంపై ఎక్స్ వేదికగా స్పందించారు. వానాకాలం వరి కోతలు సాగుతున్నప్పటికీ రైతుబంధు (రైతుభరోసా) ఊసే లేదని మండిపడ్డారు. కనీసం పంట కొనుగోలు చేయడం లేదని దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు.

రైతులపై నిర్లక్ష్యమా? : అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సీజన్లో ప్రభుత్వం 91 లక్షల 28 వేల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కోనుగోళ్ల ద్వారా సేకరిస్తామని చెప్పి అక్టోబర్ 28వ తేదీ వరకు 913 మంది రైతుల నుంచి కేవలం 7,629 వేల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసిందని తెలిపారు. రైతన్న అంటే ఎంత నిర్లక్ష్యమో చూడండని ఆయన వ్యాఖ్యానించారు. దళారులతో కుమ్మక్కైన కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదని ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మిల్లుల కేటాయింపు జరగనే లేదని కేటీఆర్ విమర్శించారు.

సేకరించిన ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపాలో తెలియక ఐకేపీ కేంద్రాల్లో కూడా కొనుగోలు ప్రక్రియ నిలిచిందని అన్నారు. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం డైవర్షన్ పాలిటిక్స్​లో బిజీబిజీగా ఉన్నారని కేటీఆర్​ ఆక్షేపించారు. ప్రస్తుత రాజకీయాలు బాగాలేవని చెప్పారు. ఒకానొక సందర్భంలో రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగాలనుకున్నట్లు తెలిపారు. కానీ ప్రజల తరఫున బలంగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

ఒక దశలో పాలిటిక్స్​ నుంచి వైదొలగాలనుకున్నా : కేటీఆర్​

రైతులు, ప్రజల కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధమే: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details