KTR Election Campaign in Huzurabad : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో నిత్యవసరాల ధరలు పెరిగాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ముడి చమురు ధరలు తగ్గినా పెట్రో ధరలు మాత్రం తగ్గలేదని విమర్శించారు. ఆరు నెలల్లో పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌లో రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ తరుఫున ఎన్నిక ప్రచారం చేశారు.
KTR Fire on PM Modi Government: ఐదేళ్లలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గల్లీలో, దిల్లీలో ఎక్కడైనా కనిపించారా అని కేటీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్ అభివృద్ధికి సంజయ్ కేంద్ర నిధులు తీసుకువచ్చారా అని నిలదీశారు. వినోద్ కుమార్ ప్రజల తరఫున పార్లమెంటులో గళం విప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనకి కాంగ్రెస్ పాలనకి మధ్య తేడా గమనించాలని అన్నారు. ప్రలోభాలకు ప్రజలు లొంగవద్దని కోరారు. హస్తం పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీలు నెరవేర్చారా అని అడిగారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంపై పోరాటం చేయాలని తెలిపారు. పోరాడే వ్యక్తులే పార్లమెంటుకు రావాలని సూచించారు.
"ప్రలోభాలకు ప్రజలు లొంగవద్దని కోరుతున్నాను. కేసీఆర్ పాలన ఎలా ఉంది? కాంగ్రెస్ పాలన ఎలా ఉందో గమనించండి. ఆరు గ్యారంటీల హామీలు నెరవేర్చారా? పోరాడే వ్యక్తులే పార్లమెంటుకు రావాలి. కేంద్ర నిధులు రాబట్టే సత్తా వినోద్‌కు ఉంది. చేనేత మీద మొదటిసారి జీఎస్టీ 5 శాతం వేసిన ప్రధాని మోదీనే. మోదీ హయాంలో నిత్యవసరాల ధరలు పెరిగాయి." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు