తెలంగాణ

telangana

ETV Bharat / politics

పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్ధానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి : కేటీఆర్‌ - KTR Comments on CM Revanth Reddy - KTR COMMENTS ON CM REVANTH REDDY

KTR Comments on CM Revanth Reddy : లోక్​సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఇద్దరం పోటీ చేద్దామని, ఎవరు గెలుస్తారో తేల్చుకుందామని సీఎం రేవంత్​రెడ్డికి బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సవాల్​ విసిరారు. రేవంత్​కు ధైర్యం లేదన్న ఆయన, బీజేపీ పార్టీలోకి పోవాలన్నది రేవంత్‌ రెడ్డి ఆలోచన అని విమర్శించారు.

KTR Fires on Congress
KTR Comments on CM Revanth Reddy

By ETV Bharat Telangana Team

Published : Mar 27, 2024, 3:27 PM IST

Updated : Mar 27, 2024, 10:00 PM IST

KTR Comments on CM Revanth Reddy : పది లక్షల ఫోన్లు ట్యాప్ చేశారని దుష్ప్రచారం చేస్తున్నారని, చేస్తే దొంగలవి ఒకటో, రెండో ఫోన్లు ట్యాప్ చేసి ఉండవచ్చని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి లీకుల వీరుడు అన్న ఆయన, ధైర్యం ఉంటే తప్పులు ఎవరు చేశారో గుర్తించి లోపల వేయాలని వ్యాఖ్యనించారు. పార్లమెంట్​ ఎన్నికల కార్యాచరణపై మల్కాజిగిరిలో జరిగిన లోక్‌సభ నియోజకవర్గ బీఆర్​ఎస్​ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దమ్ముంటే మల్కాజిగిరిలో తేల్చుకుందామని రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తే పారిపోయాడన్న ఆయన, దానిపై ఇప్పటి వరకు కనీసం మాట కూడా మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ అవకాశం ఉందని, మల్కాజిగిరిలో పోటీ చేసి తేల్చుకుందామని మరోమారు సవాల్ చేశారు.

నగరంలోని ఖాళీ బిందెలు చూడాలి : రేవంత్ పాలన వంద రోజుల అబద్ధమన్న కేటీఆర్, లంకె బిందెలు కాదు నగరంలోని ఖాళీ బిందెలు చూడాలని కోరారు. 30 మంది కాంగ్రెస్, కొంత మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి పోవాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన అని, మళ్లీ మాతృ సంస్థ కమలం పార్టీలోకి పోవడం ఖాయమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వంద రోజుల్లో అన్నీ బంద్ చేశారని, అందరినీ బెదిరించి వసూళ్లు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం స్కాం, బర్రెలు, గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్ అంటూ పక్కదారి పట్టిస్తున్నారన్న కేటీఆర్​, కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయం అంటున్న కాంగ్రెస్ నేతలకు కవిత అరెస్ట్ అన్యాయం కాదా అని ప్రశ్నించారు.

KTR Fires on Congress :దగుల్బాజీ ప్రభుత్వం ఎట్లా వచ్చిందని హైదరాబాద్ ప్రజలు బాధ పడుతున్నారని, పదేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పి ఈటల రాజేందర్ ఓట్లు అడగాలని కేటీఆర్ అన్నారు. పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్ధానికి, మరో వంద రోజుల విషానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు. తెలంగాణకు ఒక్క పని చేయని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. రెండు లక్షల రుణమాఫీ జరిగిన వాళ్లంతా కాంగ్రెస్​కు ఓట్లు వేయాలని, మిగిలిన వాళ్లు బీఆర్​ఎస్​కు ఓటు వేయాలని కోరారు. కేసీఆర్​కు వెన్నుపోటు పొడిచిన ఈటల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి మల్కాజిగిరిలో పోటీలో ఉన్నారని, రాగిడి లక్ష్మారెడ్డికి సీనియారిటీ లేకున్నా సిన్సియారిటీ ఉందని తెలిపారు.

'రాహుల్​ గాంధీ ఏమో కేజ్రీవాల్​ను అరెస్టు చేయడం తప్పు లిక్కర్​ స్కాం లేదు, మందు లేదు అని ఆయన అంటారు. రేవంత్​ రెడ్డి ఏమో కవితను అరెస్టు చేయడం కరెక్టే స్కాం స్కాం అని అంటున్నారు. అందుకే అంటున్నా ఎవరి మనిషివి నువ్వు. రాహుల్​ గాంధీ మనిషివా? కాంగ్రెస్​ మనిషివా? బీజేపీ మనిషివా చెప్పు.'-కేటీఆర్​, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్దానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి : కేటీఆర్‌

లోక్‌సభ ఎన్నికలయ్యాక రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయం : కేటీఆర్ - ktr fires on revanth reddy

ఆధారాలు లేకుండా ఫేక్ న్యూస్ రాస్తే ఊరుకునేది లేదు : కేటీఆర్​ - KTR Fires on CM Revanth

Last Updated : Mar 27, 2024, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details