BRS MLC Kavitha Bail KTR and Bandi Tweets : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆమె తిహాడ్ జైలు నుంచి బయటకు రానుండడంతో ఎక్స్ వేదికగా కేటీఆర్, కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్స్ చేశారు. కానీ బండి సంజయ్ చేసిన ట్వీట్‌పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆమె బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంతో కూడిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు :కవిత బెయిల్ రావడంతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. చివరి న్యాయం గెలిచిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉపశమనం లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కవితకు బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ విజయం : మరోవైపు కవితకు బెయిల్ రావడం అనేది బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటికీ విజయమని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అలుపెరగని ప్రయత్నాలు ఫలించాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ లీడర్ బెయిల్‌పై బయటకు కాంగ్రెస్ నేతకు రాజ్యసభ సీటు అని తెలిపారు. బెయిల్ కోసం వాదించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం కేసీఆర్ రాజకీయ చతురత అని బండి సంజయ్ విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఈ విధంగా స్పందించారు.
బండి సంజయ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్ :ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుకు వక్రభాష్యం చెప్పడం సమంజసం కాదని హితవు పలికారు. సంజయ్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు, సీజేఐ సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఆయన మాటలను కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఊహించిందేనని బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మొన్నటి ఎన్నికల్లో చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూశారని ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల్లో కుమ్మక్కై బీఆర్ఎస్ బీజేపీకీ దాసోహం అయిందని విమర్శించారు. హరీశ్‌రావు, కేటీఆర్ దిల్లీలో బీజేపీ నేతల చుట్టూ తిరిగి ఆపద మొక్కులు మొక్కారన్నారు. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్లమీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. ఈ విషయాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఇంక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట - దిల్లీ మద్యం కేసులో బెయిల్ మంజూరు - BRS MLC KAVITHA GRANTED BAIL
సిసోడియాకు బెయిల్ వచ్చింది కదా, త్వరలోనే కవితకు కూడా బెయిల్ వస్తుంది! : కేటీఆర్ - BRS Leader KTR On Kavitha Bail