Minister Komatireddy Counter to KCR :ఎన్నికలకోడ్ వల్ల రైతు బంధు, రుణమాఫీ ఇవ్వలేకపోయామని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక అన్ని హామీలు నెరవేరుస్తామని తెలిపారు. కేసీఆర్, జగన్ కుట్రల వల్ల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను కొనాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని సవాల్ విసురుతున్నానని పేర్కొన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ను, ఆ పార్టీ నేతలను టచ్ చేసి చూడండి(Komatireddy Challenge to KCR) అంటూ సవాల్ విసిరారు. నల్గొండలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
బీఆర్ఎస్ను పునాదులతో సహా లేపేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. మూడు నెలల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్లో మిగులుతారని జోస్యం చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ(Congress Vs BJP) మధ్యేనని స్పష్టం చేశారు. 12 నుంచి 13 ఎంపీ సీట్లలో కాంగ్రెస్గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు వచ్చినా తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబ దగా వల్ల కవిత బలైపోయిందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు: కేసీఆర్
కేసీఆర్, కేటీఆర్ త్వరలో జైలుకు : కేసీఆర్, కేటీఆర్ త్వరలో జైలుకి పోవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ కట్టించి స్వాగతం పలుకుతామని ఎద్దేవా చేశారు. రేపటి నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అంటే ఏంటో చూపిస్తా అంటూ బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు.