తెలంగాణ

telangana

ETV Bharat / politics

బీఆర్‌ఎస్‌కు భవిష్యత్‌ లేదు - కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేదు : కిషన్‌ రెడ్డి - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

Kishan Reddy is on Lok Sabha Election Campaign in Musheerabad : బీఆర్‌ఎస్‌ పార్టీకి భవిష్యత్తు లేదు - కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.

Kishan Reddy is on Lok Sabha Election Campaign in Musheerabad
Kishan Reddy is on Lok Sabha Election Campaign in Musheerabad

By ETV Bharat Telangana Team

Published : Apr 3, 2024, 4:50 PM IST

Updated : Apr 3, 2024, 5:07 PM IST

Kishan Reddy is on Lok Sabha Election Campaign in Musheerabad :దేశంలో 'అగ్లీ బార్‌ మోదీ సర్కారు చార్సోపార్‌' నినాదం బీజేపీది కాదని ఆ నినాదం దేశ ప్రజలందరిదీ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని ముషీరాబాద్‌ అరుణ కో ఆపరేటివ్‌ సొసైటీ, జెమినీ కాలనీ ముషీరాబాద్‌ శివాలయం పరిసరాలలోని మల్లేశ్‌ టవర్స్‌, విద్యానగర్‌లోని పద్మాకాలనీ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ప్రజలతో మాట్లాడారు. అలాగే ప్రజలు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.

దేశానికి మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రి(PM Modi)గా చేయాలని భారతీయులు ఆకాంక్ష అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా అగ్లీ బార్‌ మోదీ సర్కారు అనే నినాదంతోనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు(Lok Sabha Polls 2024) పోటీ చేస్తున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని సీట్లను గెలవడానికి పూర్తి విశ్వాసంతో ప్రయత్నం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

Kishan Reddy Lok Sabha Election Campaign :బీఆర్‌ఎస్‌ పార్టీకి భవిష్యత్తు లేదని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేదని మోసపూరితమైన డిక్లరేషన్లు చేసిందని కిషన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో గొర్రెలు తినేది పోయి బర్రెలు తినేవారు వచ్చారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. దొంగలు పోయి గజదొంగలు వచ్చినట్లు కాంగ్రెస్‌ పార్టీ ఈ వంద రోజుల్లో రాష్ట్రాన్ని దోచుకొని రాహుల్‌ గాంధీకి కప్పం కడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలను ప్రజలు గెలిపించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మరోసారి ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు.

బీఆర్‌ఎస్‌కు భవిష్యత్‌ లేదు - కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేదు : కిషన్‌ రెడ్డి

"మోదీ సర్కారు అగ్లీ బార్‌ చార్సోపార్‌ ఇది బీజేపీ నినాదం కాదు సమస్త భారతీయుల నినాదం. సమస్త భారతీయుల ఆకాంక్ష. బీఆర్‌ఎస్‌ పార్టీ కనుమరుగు అయిపోయింది. బీఆర్‌ఎస్‌కు రేపు అనేది లేదు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు కానీ, డిక్లరేషన్లు కానీ మోసపూరితమైనవి అని అర్థమైంది. దొంగలు పోయి గజదొంగలు వచ్చినట్లుగా కాంగ్రెస్‌ పార్టీ వంద రోజుల పాలన సాగింది."- కిషన్‌ రెడ్డి, కేంద్రమంత్రి

రాష్ట్రంలో రోజురోజుకూ మారుతోన్న రాజకీయ పరిణామాలు - చేరికల తలుపులు తెరిచిన కాంగ్రెస్

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు : కిషన్​రెడ్డి

Last Updated : Apr 3, 2024, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details