kishan Reddy Fires On Congress Party :శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా లోక్‌సభ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు(Congress Party) లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. డిక్లరేషన్లు, గ్యారంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోపై కిషన్‌రెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. అంతకు ముందు బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల్లో మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని అనంతరం మాట్లాడారు.
నోట్లను ముద్రించే మిషన్లు పెడతారేమో : కిషన్‌రెడ్డి
ఇచ్చిన హామీలను(congress Guarantees) అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నోట్లను ముద్రించే మిషన్లు పెడతారేమోనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ముందు గత ఎన్నికల్లో యూత్, మహిళా, రైతు డిక్లరేషన్(Farmers Declaration) పేరుతో ఏయే గ్యారంటీలు ఇచ్చారో దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే అమలు చేసి చూపించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Kishan Reddy On Babu Jagjivan Ram :బాబు జగ్జీవన్ రామ్ గొప్ప ప్రజాస్వామ్య వాది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన స్పూర్తితోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు(Welfare Scheames) మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ అత్యన్నతమైన ఉపప్రధాని పదవిని అలంకరించారని తెలిపారు. ఆయన దేశానికి ఎంతో సేవ చేశారని తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారని బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు.
జగ్జీవన్ రామ్ ఆశయ స్పూర్తితోనే బీజేపీ పథకాలు : కిషన్ రెడ్డి
జనతా పార్టీ ఆయనని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ మాత్రం దళితుల్ని ప్రధాని కాకుండా అడ్డుకుందని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. విషప్రచారం చేసి ఆయనను ప్రధాని కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని తెలిపారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా ఆయన స్పూర్తితోనే పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని వివరించారు.