తెలంగాణ

telangana

ETV Bharat / politics

నేను అవకాశవాదిని కాదు - అవకాశాలే నా వద్దకు వచ్చాయి : కడియం శ్రీహరి - Kadiyam Srihari Fires on BRSLeaders - KADIYAM SRIHARI FIRES ON BRSLEADERS

Kadiyam Srihari Fires on BRS Leaders : బీజేపీ ఆగడాలు అడ్డుకునేందుకే కాంగ్రెస్‌లో చేరానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గ సమస్యలు పరిష్కరించలేమన్న ఆయన, నిందితులు బీజేపీలో చేరగానే పునీతులౌతున్నారని వ్యాఖ్యానించారు. తనను రాజీనామా చేయమని అడిగే హక్కు, బీఆర్‌ఎస్‌కు లేదని కడియం వ్యాఖ్యానించారు.

Lok Sabha Elections 2024
Kadiayam Srihari Joined in Congress

By ETV Bharat Telangana Team

Published : Apr 2, 2024, 2:57 PM IST

Kadiyam Srihari Fires on BRS Leaders :భారత రాష్ట్ర సమితిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన తనపై బీఆర్ఎస్ నేతలు అసభ్యకర ఆరోపణలు చేస్తున్నారని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి, కడియం శ్రీహరి పాల్గొన్నారు. పార్టీని చాలామంది వీడినప్పటికీ తననే టార్గెట్ చేశారన్న ఆయన, పల్లా రాజేశ్వర్‌రెడ్డి లాంటి చీడపురుగుల వల్లే బీఆర్‌ఎస్‌కు ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు.

తనను రాజీనామా చేయాలనే హక్కు బీఆర్‌ఎస్‌ నేతలకు లేదని, గత ప్రభుత్వమే ఈ సంస్కృతి తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. తాను అవకాశవాదిని కాదని, పదవులే తనను వెతుక్కుంటూ వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ ఆహ్వానం మేరకే పార్టీలో చేరామన్న కడియం, తన కుమార్తెకు పోటీచేసే అవకాశమిచ్చిన అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. హస్తం పార్టీ(Congress Party) బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే కాంగ్రెస్​ గూటికి చేరారు - స్టేషన్‌ ఘన్‌పూర్‌లో 'కారు' నడిపేదెవరు? - Lok Sabha Elections 2024

"నిన్న, మొన్నటి వరకు నా చుట్టు ఉన్న వాళ్లు ఒక్కరోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారంటే వాళ్ల కడుపులో ఎంత విషమున్నదో అర్థమౌతోంది. అలానే పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానని, నాపై దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. అది నిజమని బీఆర్‌ఎస్ నేతలు ఎవరైనా నిరూపిస్తే, ఎన్నికల నుంచి నేను, నా కుమార్తె తప్పుకుంటామని సవాల్‌ విసురుతున్నాను."-కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే

Kadiyam Srihari Comments on BJP : కేంద్రంలోని మోదీ సర్కార్, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని బీజేపీ నియంతృత్వాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని పలికారు. కాషాయ పార్టీ ఆగడాలు అడ్డుకునేందుకు కాంగ్రెస్‌లో చేరానని కడియం స్పష్టం చేశారు. వ్యవస్థలను అపహాస్యం చేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందన్న ఆయన, సీబీఐ, ఈడీ కేసుల్లో ప్రతిపక్ష పార్టీ నేతలను ఇరికిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గ సమస్యలు పరిష్కరించలేమనే భావనతోనే హస్తం గూటికి చేసినట్లు తెలిపారు.

బీఆర్‌ఎస్‌లో తనకు కేసీఆర్‌ ఎన్నో అవకాశాలు ఇచ్చారని వివరించారు. చాలా మంది ఆ పార్టీని వీడినా, నన్నే ఎక్కువగా టార్గెట్‌ చేశారు. మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి(BRS LeaderErrabelli Dayakar Rao) ఓటమి సిగ్గుచేటని కడియం విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నుంచి కడియం శ్రీహరి, కావ్య వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అనంతరం వరంగల్‌ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ కడియం కావ్యకు కేటాయించింది.

"మే 13 తారీఖున జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోకి వరంగల్ పార్లమెంట్‌ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున నన్ను ప్రకటించారు. అందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మా నాన్నలానే నేను మచ్చలేని నాయకురాలుగా ఎదుగుతాను. అభివృద్ధి దిశగా వరంగల్‌ను నడిపే దిశగా నేను పనిచేస్తాను. నియోజకవర్గ ప్రజానికం, స్థానిక పార్టీ నేతలు నన్ను ఆశీర్వదించి నా విజయానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను."-కడియం కావ్య, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి

నేను అవకాశవాదిని కాదు - అవకాశాలే నా వద్దకు వచ్చాయి : కడియం శ్రీహరి

వరంగల్‌ బరిలో కాడియం కావ్య- ఆ 3 సీట్లపై ఇంకా రాని స్పష్టత - lok sabha elections 2024

లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్‌లో చేరా - నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత : కడియం శ్రీహరి - MLA KADIYAM Fires ON BJP

ABOUT THE AUTHOR

...view details