ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

పవన్ కల్యాణ్​ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఫిక్స్ - పిఠాపురం నుంచే సమరశంఖం - Pawan Kalyan Election Campaign - PAWAN KALYAN ELECTION CAMPAIGN

Janasena Pawan Kalyan Election Campaign: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఈనెల 30 నుంచి ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. పవన్ కల్యాణ్‌ పోటీచేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారిని, దత్తపీఠాన్ని పవన్‌ దర్శిస్తారు. మూడు రోజులపాటు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. ఉగాది వేడుకలను కూడా పవన్‌ పిఠాపురంలోనే నిర్వహించుకోనున్నారు.

Pawan_Kalyan_Election_Campaign
Pawan_Kalyan_Election_Campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 10:24 AM IST

Janasena Chief Pawan Kalyan Election Campaign: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పిఠాపురం నుంచే సమర శంఖం పూరించనున్నారు. మార్చి 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పవన్ కల్యాణ్​ నిర్ణయించారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్స్ రూపొందించాలని నేతలకు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశమయ్యారు.

మూడు విడతలుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ ఉండాలని నాయకులకు స్పష్టం చేశారు. పిఠాపురం వెళ్లిన తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక (Puruhutika Shaktipeeth) అమ్మవారిని పవన్ దర్శనం చేసుకుంటారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం దత్తపీఠాన్ని దర్శిస్తారు. మూడు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు.

క్రియాశీల కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు ఉంటాయని పవన్‌ కల్యాణ్​ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి భాగస్వాములైన తెలుగుదేశం, బీజేపీ నాయకులతో భేటీలకు కానున్నారు. పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలని పవన్ కల్యాణ్‌ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగ్గ ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలోని బంగారు పాప దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశంతో పాటు సర్వమత ప్రార్థనల్లో పవన్‌ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉగాది వేడుకలను సైతం పిఠాపురంలోనే పవన్ నిర్వహించుకోబోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఎన్నికల్లో వీర మహిళలు క్రియాశీలక పాత్ర పోషించాలి: పవన్‌ - Pawan Kalyan on Veera Mahilalu

Chandrababu Election Campaign: మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సైతం ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచే చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రజాగళం (Praja Galam) పేరుతో ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు.

ప్రజాగళం పేరుతో ఈనెల 27వ తేదీ నుంచి 31 తేదీ వరకు చంద్రబాబు వరుస పర్యటనలు చేయనున్నారు. 27న పలమనేరు, నగిరి, నెల్లూరు రూరల్​లలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28వ తేదీన రాప్తాడు, సింగనమల, కదిరిలో పర్యటించనున్నారు. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరిపేట, శ్రీకాళహస్తిలలో ప్రచారం చేయనున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతల పాడు, ఒంగోలులలో చంద్రబాబు పర్యటనలు ఉండనున్నాయి.

ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు - ప్రచారానికి సిద్ధమైన జగన్, చంద్రబాబు - Political Heat in AP

ABOUT THE AUTHOR

...view details