Harish Rao Shocking Comments on CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. రూ.2 లక్షల రుణమాఫీపై ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుండగా, హరీశ్‌రావు సీఎంకు సవాల్ విసిరారు. ఆగస్టు 15లోపు మాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని, మళ్లీ పోటీ కూడా చేయబోనని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాణం చేసేందుకు ఈ నెల 26న ఉదయం 10 గంటలకు అమల వీరుల స్థూపం దగ్గరకు రావాలన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
మెదక్ సీటు మాదే - రెండో స్థానం కోసం హస్తం, కమలం పోటీపడుతున్నాయి : హరీశ్‌రావు - Harish Rao Comments on Congress BJP
Harish Rao on Rythu Runamafi in Telangana : ఈ సందర్భంగా నాలుగున్నర నెలల కాంగ్రెస్ పాలన మొత్తం తిట్లు, దేవుడి మీద ఒట్లతోనే సరిపోతుందని హరీశ్‌రావు అన్నారు. ఖమ్మం వస్తే రాములవారిపై, మెదక్ వెళ్తే ఏడుపాయల అమ్మవారు, మహబూబ్‌నగర్ వెళ్తే జోగులాంబ అమ్మవారిపై ఒట్లు పెడుతున్నారని విమర్శించారు. ఎన్ని దేవుళ్ల మీద ఒట్లు పెట్టినా, పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిని జిల్లాకు చెందిన మంత్రులు గాలికి వదిలేశారని విమర్శించారు.
"రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసగించారు. హామీలు అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలి. కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. శుక్రవారం అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణానికి రావాలి. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న హస్తం పార్టీకి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారు."- హరీశ్‌రావు, మాజీ మంత్రి
నామినేషన్ ఒక్కరోజులో గడుస్తున్నా అభ్యర్థిని ప్రకటించలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది హరీశ్‌రావు Harish Rao Comments on Khammam Development : ఖమ్మం జిల్లా ప్రజలు తాగునీరు లేక, రైతులకు సాగు నీరందక, నాణ్యమైన కరెంటు సరఫరా అందక కష్టాలు పడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. మంత్రులు మాత్రం తమ కుటుంబ సభ్యులకు టికెట్ల కోసం దిల్లీ, బెంగళూరుకు చక్కర్లు కొడుతున్నారన్నారు. ఒక్కరోజుతో నామినేషన్ల గడువు ముగుస్తున్నా అభ్యర్థి ఎవరో తేల్చుకోలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. పార్టీ అభ్యర్థిపైనే ఏకాభిప్రాయం లేని నాయకులు, జిల్లా ప్రజలకు ఏం సేవ చేస్తారని ప్రశ్నించారు. పూటకో పేరు, రోజుకో పేరు, జిల్లాతో సంబంధం లేనోళ్ల పేర్లు తెరపైకి వస్తుందంటే, కాంగ్రెస్ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఛాలెంజ్ యాక్సెప్టెడ్ - ఆ హామీలన్నీ అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా - మళ్లీ పోటీ చేయను : హరీశ్ రావు - HARISH RAO CHALLENGES CM REVANTH
ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ను రద్దు చేస్తారా? - హరీశ్‌రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ - CM Revanth Reddy Election Campaign