Harish Rao On Projects Handover To KRMB :కేఆర్‌ఎంబీలో ప్రాజెక్టులను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.గత నెలలో దిల్లీలో సమావేశం జరిగిందని , నెల రోజుల్లోపు 15 అవుట్‌లెట్స్‌ను కేఆర్‌ఎంబీకి(KRMB) అప్పగిస్తామని మినిట్స్‌లో స్పష్టంగా చెప్పారని తెలిపారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించారని పత్రికలు వార్తలు కూడా రాశాయన్నారు. ఆ వార్తలు తప్పు అయితే ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వలేదని ప్రశ్నించారు.
Harish Rao Slams Congress Govt Over KRMB Projects :ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వితండవాదం తప్ప మరేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్‌పై(KCR) రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఆక్షేపించారు. కేఆర్‌ఎంబీ సమావేశంలో ప్రాజెక్టులను అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, మళ్లీ అప్పగించేది లేదని రంకెలేస్తోందన్నారు.
Harish Rao On Congress Govt :తాను మీడియా సమావేశం పెట్టాక ప్రభుత్వం దిల్లీకి లేఖ రాసిందని, ఫిబ్రవరి 1న కేఆర్‌ఎంబీ రెండో మీటింగ్ జరిగిందని హరీశ్‌రావు తెలిపారు. అందులో ప్రాజెక్టులు, ఉద్యోగులను బోర్డు పరిధిలోకి తీసుకొస్తామని ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకరించినట్లు పేర్కొన్నారు. పదేళ్లలో కేసీఆర్ గవర్నమెంట్ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించలేదని కానీ వచ్చిన 2 నెలల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) వాటిని దిల్లీ చేతిలో పెట్టారని విమర్శించారు.