తెలంగాణ

telangana

ETV Bharat / politics

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులైనా రుణమాఫీ చేయలేదు : హరీశ్​రావు - LOK SABHA Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Harish Rao Fires On Congress : హామీలు అమలు చేయలేక కాంగ్రెస్‌ పార్టీ ముఖం చాటేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకలకే ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా రుద్రారంలో మెదక్‌ ఎంపీ అభర్థి వెంకటరామిరెడ్డి తరపున హరీశ్​రావు ప్రచారంలో పాల్గొన్నారు.

Telangana Lok sabha Elections 2024
BRS MLA Harish Rao Fires On Congress

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 3:57 PM IST

BRS MLA Harish Rao Fires On Congress : హామీలు అమలు చేయలేక కాంగ్రెస్‌ పార్టీ ముఖం చాటేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గత ఎన్నికల హామీలను నెరవేర్చని రాష్ట్ర సర్కార్‌ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మరోమారు మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో మెదక్‌ ఎంపీ అభర్థి వెంకటరామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించిన హరీశ్‌ రావు ప్రచార రథాలను ప్రారంభించారు. హామీల పేరుతో రైతులను కాంగ్రెస్​ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. వంద రోజులు గడిచినా కాంగ్రెస్​ పథకాలు జాడ లేవని, రైతుల కన్నీళ్లకు కారణం అవుతున్న ప్రభుత్వాలు పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు.

Harish Rao Campaign in Sangareddy :మహిళలకు హామీ ఇచ్చిన రూ.10 వేలు చెల్లించాకే కాంగ్రెస్ ఓట్లు అడగాలని అన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పింఛన్లు ఇవ్వకుండా రోజులు గడిపేస్తున్నారని, నిరుద్యోగ భృతిపై రోజుకోమాట మాట్లాడుతున్నారని హరీశ్‌రావుమండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభ సాక్షిగా అబద్ధం చెప్పారని ధ్వజమెత్తారు. అనేక హామీలిచ్చి రైతులను మోసం చేశారని విమర్శించారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారని వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్​ హయాంలో రైతులు తమ పంటలు తామే కాల్చుకునే పరిస్థితి వచ్చింది : హరీశ్​రావు - BRS Leaders Deeksha

"అధికారంలోకి వచ్చి వంద రోజులైనా రైతులకు రుణమాఫీ చేయలేదు. మహిళలకు హామీ ఇచ్చిన రూ.10 వేలు చెల్లించాకే కాంగ్రెస్ ఓట్లు అడగాలి. ప్రభుత్వం ప్రజలకు పింఛన్లు ఇవ్వకుండా రోజులు గడిపేస్తున్నారు. నిరుద్యోగ భృతిపై రోజుకోమాట మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల వేళ అనేక హామీలిచ్చి రైతులను మోసం చేశారు. అభయహస్తం, కేసీఆర్‌ కిట్, వరికి బోనస్ ఏమీ ఇవ్వడం లేదు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారు."- హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులైనా రుణమాఫీ చేయలేదు : హరీశ్​రావు

బీఆర్ఎస్​కు ఓటువేసి దీవించాలి : బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తారని హరీశ్ రావు అన్నారు. గళం ఎత్తేవారు కావాలా గులాం గిరి చేసే వారు కావాలా అని ప్రశ్నించారు. గతంలో బీజేపీ నేత రఘునందన్‌రావు కూడా ఎన్నో హామీలు ఇచ్చి, గెలిచాక మరిచిపోయారని గుర్తుచేశారు. మాట తప్పినందుకే రఘునందన్‌రావును దుబ్బాకలో ప్రజలు ఓడించారని హరీశ్​రావు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఓటువేసి దీవించాలని ప్రజలను కోరారు.

కాంగ్రెస్​ ఎక్కడైనా ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండదు : హరీశ్​ రావు - Lok Sabha Elections 2024

నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని అప్పుడే మాట మార్చారు : హరీశ్‌రావు - Harish Rao Fires on Congress Party

ABOUT THE AUTHOR

...view details