తెలంగాణ

telangana

ETV Bharat / politics

కాంగ్రెస్, బీజేపీల అబద్ధాలు, మోసపూరిత ప్రచారాలతో తెలంగాణ ప్రజల గుండెలు మండుతున్నాయి : హరీశ్​రావు - Harish Rao Fires on CM Revanth

Harish Rao Election Campaign in Hanamkonda District : కాంగ్రెస్, బీజేపీల అబద్ధాలు, మోసపూరిత ప్రచారాలతో తెలంగాణ ప్రజల గుండెలు మండుతున్నాయని హరీశ్​రావు అన్నారు. రైతుబంధు ఆలస్యం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ ​రెడ్డి రైతులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, ఇప్పుడేమో దేవుళ్ల మీద ఒట్లు పెడుతున్నారని విమర్శించారు. హస్తం పార్టీ ప్రభుత్వం రివర్స్ గేర్​లో నడుస్తుందని హరీశ్​రావు ఎద్దేవా చేశారు.

Harish Rao Fires on CM Revanth
Harish Rao Fires on CM Revanth (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 1:31 PM IST

Harish Rao Fires on CM Revanth Reddy :రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రచారం జోరందుకుంటుంది. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో అత్యధిక లోక్​సభ స్థానాలను గెలుచుకోవడంపై బీఆర్ఎస్‌ ఫోకస్ పెట్టింది. సభలు, సమావేశాలు, రోడ్‌ షోలు, కార్నర్ మీటింగ్​లు, ఇంటింటి ప్రచారాలతో ప్రజల వద్దకు వెళ్తోంది. అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Lok Sabha Elections 2024 : తాజాగా ఇవాళ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు పర్యటించారు. కరీంనగర్ లోక్‌సభ ఎంపీ అభ్యర్థి బోయిన్‌పల్లి విన్‌ద్‌కుమార్​కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేసీఆర్‌ అడిగితే, ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి దుర్భాషలాడుతున్నారని హరీశ్​రావు మండిపడ్డారు. సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే అని విమర్శించారు.

బీఆర్​ఎస్​పై బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతోంది : హరీశ్​రావు - Harish rao Fires on BJP

రేవంత్‌ రెడ్డి వెళ్లిన చోటల్లా దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారని హరీశ్​రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌ అంటేనే కరవు అని ఎద్దేవా చేశారు. మోసం చేసిన హస్తం పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. తెలంగాణకు రక్ష బీఆర్ఎస్ అని తెలిపారు. మరోవైపు కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చిన ఘనత తమ పార్టీదేనని హరీశ్​రావు గుర్తు చేశారు. రైతుబంధు ద్వారా 11 విడతల్లో రూ.72,000 ఇచ్చామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పదవి కంటే ప్రజల సంతోషమే తనకు ముఖ్యమని చెప్పారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తే, రాజీనామా చేస్తానని హరీశ్‌రావు పునరుద్ఘాటించారు.

"కాంగ్రెస్, బీజేపీల అబద్ధాలు, మోసపూరిత ప్రచారాలతో తెలంగాణ ప్రజల గుండెలు మండుతున్నాయి. కాంగ్రెస్ వాళ్లు వచ్చాక కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్​లు లేవు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు అండగా ఉంటుంది. ఎమ్మెల్యే పదవి కంటే ప్రజల సంతోషమే నాకు ముఖ్యం. ఆరు గ్యారంటీలు అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా."- హరీశ్​రావు, బీఆర్​ఎస్​ మాజీ మంత్రి

సీఎం రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలు (etv bharat)

అబద్ధాలు ఆడటంలో ఏదైనా అవార్డు ఉంటే - సీఎం రేవంత్​ రెడ్డికే ఫస్ట్​ ప్రైజ్ : హరీశ్‌రావు - harish rao counter to cm revanth

తెలంగాణను తెచ్చింది సిద్దిపేటనే - సిద్దిపేట లేకుంటే తెలంగాణ లేదు : హరీశ్​రావు - Harishrao Comments on cm revanth

ABOUT THE AUTHOR

...view details