Former CM KCR Polam Bata Programme at Karimnagar : పొలం బాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఎండిపోయిన పంట పొలాలను(Polam Bata) పరిశీలించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేనేత కార్మికులు, విద్యుత్, రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
చేనేత కార్మికులకు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. చేనేత కార్మికులను ఆదుకోకపోతే రాష్ట్రం రణరంగం అవుతుందని హెచ్చరించారు. ఈ రంగం కార్మికులకు 10 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితి మళ్లీ వచ్చిందని చెప్పారు. బీఆర్‌ఎస్(BRS) కంటే 1.80 శాతం ఓట్లు మాత్రమే కాంగ్రెస్‌కు ఎక్కువగా వచ్చాయన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు విని ప్రజలు మోసపోయారని ధ్వజమెత్తారు.
విద్యుత్‌పై కేసీఆర్ సీరియస్ వ్యాఖ్యలు : గత వేసవిలో 14,500 మెగావాట్ల విద్యుత్ సరఫరా జరిగిందని, ఈ వేసవిలో 15,200 మెగావాట్ల విద్యుత్ సరఫరా జరిగిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఈ వేసవిలో గతేడాది కంటే 700 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అదనంగా వచ్చిందన్నారు. ఈ ఏడాది ఎన్టీపీసీ(NTPC) నుంచి తెలంగాణకు అదనంగా 1400 మెగావాట్లు లభ్యత పెరిగిందని చెప్పారు. 1400 మెగావాట్లు లభ్యత పెరిగితే 700 మెగావాట్లు మాత్రమే అదనంగా సరఫరా చేశారని దుయ్యబట్టారు.
రైతు బంధు రాకపోవడంతో రైతులు అప్పులు పాలు : దేశానికి ఎంతమంది సీఎంలు, ప్రధానులు వచ్చినా రైతుబంధు ఆలోచన రాలేదని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రముఖ ఆర్థికవేత్త అశోక్ గులాటితో చర్చించి రైతుబంధు పథకం తెచ్చామని వివరించారు. రైతుబంధు వేయకపోవటం వల్ల రైతులు మళ్లీ అప్పుల పాలయ్యారని ఆవేదన చెందారు.
బీఆర్‌ఎస్ ఖాళీ అవుతుందనే భయంతోనే కేసీఆర్ బయటికొచ్చారు : భట్టి విక్రమార్క
KCR Comments on Kaleshwaram Project :మేడిగడ్డ వద్ద 300 పిల్లర్లతో బ్యారేజీ నిర్మించామని, వీటిలో 3 కుంగిపోతే మొత్తం కుంగిపోయినట్లు మాట్లాడుతున్నారని మాజీ సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం త్వరగా పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని ఆరాటపడ్డాం, ఆరు నెలలు తపస్సు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేశామని హర్షించారు.
కాళేశ్వరం(Kaleshwaram Project) డిజైన్లపై కాంగ్రెస్ పాలకులకు కనీస పరిజ్ఞానం లేదని, గోదావరి నుంచి నీళ్లు ఎత్తడానికి మేడిగడ్డ బ్యారేజీతో పని లేదన్నారు. వరద 25000 క్యూసెక్కుల కంటే తగ్గితేనే మేడిగడ్డ అవసరం అన్నారు. ఇసుక బస్తాలు అడ్డుపెట్టి కూడా నీటిని ఎత్తిపోయొచ్చని, బ్యారేజీల నిర్మాణంలో చిన్నచిన్న పొరపాట్లు జరగటం సహజమని తెలిపారు. అలాగైతే గంగానదిపై కూడా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయిందని గుర్తు చేశారు.
"మేడిగడ్డ వద్ద 300 పిల్లర్లతో బ్యారేజీ నిర్మించాం. 300 పిల్లర్లలో 3 కుంగిపోతే మొత్తం మునిగిపోయినట్లు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం త్వరగా పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని ఆరాటపడ్డాం. 6 నెలలు తపస్సు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేశాం. కాళేశ్వరం డిజైన్లపై కాంగ్రెస్ పాలకులకు కనీస పరిజ్ఞానం లేదు. గోదావరి నుంచి నీళ్లు ఎత్తడానికి మేడిగడ్డ బ్యారేజీతో పని లేదు. వరద 25000 క్యూసెక్కుల కంటే తగ్గితేనే మేడిగడ్డ అవసరం. ఇసుక బస్తాలు అడ్డుపెట్టి కూడ నీటిని ఎత్తిపోయొచ్చు. బ్యారేజీల నిర్మాణంలో చిన్నచిన్న పొరపాట్లు జరగటం సహజం. ఇటీవల గంగానదిపై కూడ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది."- కేసీఆర్, బీఆర్‌ఎస్ అధినేత
కాళేశ్వరం డిజైన్లపై కాంగ్రెస్ పాలకులకు కనీస పరిజ్ఞానం లేదు - అందుకే అలా? : కేసీఆర్ వెలుగులోకి మరో కుంభకోణం - రైతు బీమా, రైతుబంధులోనూ గోల్మాల్ - రూ.2 కోట్లు స్వాహా
కాంగ్రెస్ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది: కేసీఆర్