తెలంగాణ

telangana

ETV Bharat / politics

పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు చెల్లించాలి : కేసీఆర్‌ - KCR Polam Bata Programme - KCR POLAM BATA PROGRAMME

Former CM KCR Inspect Dry Crops in Joint Karimnagar District : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మళ్లీ పొలం బాట పట్టారు. కరీంనగర్​ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Former CM KCR Inspect Dry Crops in Joint Karimnagar District
Former CM KCR Inspect Dry Crops in Joint Karimnagar District

By ETV Bharat Telangana Team

Published : Apr 5, 2024, 3:00 PM IST

Updated : Apr 5, 2024, 3:36 PM IST

Former CM KCR Inspect Dry Crops in Joint Karimnagar District :పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పొలంబాట(Polam Bata) కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌(KCR) పర్యటిస్తున్నారు. కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎండిపోయిన వరి పంటను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు.

పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు చెల్లించాలి : కేసీఆర్‌

ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌ నుంచి కరీంనగర్‌కు చేరుకున్న కేసీఆర్‌కు దారిపొడవునా ఎండిపోయిన పంటలను చూపిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు స్వాగతం పలికారు. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని మొగ్దుంపూర్‌లో సాగునీరు అందక ఎండిపోయిన వరి పంటను కేసీఆర్‌ పరిశీలించారు. నీటి సమస్యలపై సైతం అన్నదాతల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు బీఆర్‌ఎస్‌ అన్ని విధాలుగా అండగా ఉంటుందని రైతన్నలకు కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం కర్షకుల కన్నీళ్లు తుడవని పక్షంలో 10 వేల మందితో మేడిగడ్డ వద్ద ధర్నా చేద్దామని పిలుపునిచ్చారు.

బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్‌ కాన్వాయ్​ను తనిఖీ చేసిన పోలీసులు

KCR Karimnagar Tour : పదేళ్లలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోయినసారి మండుటెండలో మత్తళ్లు దూకాయని ఈసారి ఒక్క తడి ఇస్తే పంట ఇంట్లో పడేదని రైతులు కేసీఆర్‌కు చెప్పారు. పంటపై పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కేసీఆర్‌ ఎదుట రైతులు గోడు వెళ్లబోసుకున్నారు.

శ్రీరామ్‌ సాగర్‌ నీటితోనే ఈ పంటలు పండుతాయా అని రైతులను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరా తీశారు. డీ-89 కాలువ నీటిపైనే దుర్షేడ్‌, మొగ్దుంపూర్‌, చర్లబుత్కూర్‌, ఇరుకుళ్ల, చామనపల్లి గ్రామాలు ఆధారపడ్డాయని రైతులు కేసీఆర్‌కు వివరించారు. రైతుల గోడు విన్న కేసీఆర్‌ ధైర్యంగా ఉండాలని వారికి చెప్పారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట్లో భోజనం చేసిన అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

KCR Polam Bata Programme :అంతకు ముందు కరీంనగర్‌ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించి, పంటను కోల్పోయిన రైతులకు అండగా నిలిచేందుకు వెళ్తున్న మాజీ సీఎం కేసీఆర్‌కు సిద్దిపేట రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద ఘనస్వాగతం లభించింది. అనంతరం పార్టీ శ్రేణులు కేసీఆర్‌ వెంట భారీ కాన్వాయ్‌తో కరీంనగర్‌కు బయలు దేరి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు కేసీఆర్‌ అభివాదం చేస్తూ కరీంనగర్‌ వెళ్లారు.

సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలో ప్రెస్‌మీట్ : మధ్యాహ్నం బోయినపల్లిలో ఎండిన పంటలను పరిశీలించిన అనంతరం సాయంత్రం శాభాష్‌పల్లి బ్రిడ్జి వద్ద మధ్యమానేరు జలాశయాన్ని కేసీఆర్‌ పరిశీలించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

బీఆర్​ఎస్​ ఖాళీ అవుతుందనే భయంతోనే కేసీఆర్ బయటికొచ్చారు : భట్టి విక్రమార్క

వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు : కేసీఆర్‌

Last Updated : Apr 5, 2024, 3:36 PM IST

ABOUT THE AUTHOR

...view details