బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై మరో కేసు - విచారణలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు EX MLA Shakeel Son Rahil Case : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి నేరాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇటీవల ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident at Prajabhavan)లో రాహిల్ తన స్థానంలో వేరొకర్ని పోలీసుల ముందు ప్రవేశపెట్టే ప్రయత్నం చేయడం విషయం బయటకు రావడంతో దుబాయ్ పరారవ్వడం తదనంతరం పోలీసుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2022లో నమోదైన రోడ్డు ప్రమాదం కేసును రీఓపెన్ చేసి బాధితుల్ని విచారించగా రాహిల్ పాత్ర మరోమారు బయటపడింది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర ఫుట్‌పాత్‌పై నివసిస్తూ బెలూన్లు, స్ట్రాబెర్రీ విక్రయించేవారు.
Jubilee Hills Road Accident Case Update :2022 ఫిబ్రవరి 17 రాత్రి 8 గంటల ప్రాంతంలో రోడ్డు నెంబరు 45 దగ్గర వారు డివైడర్ దాటుతుండగా కేబుల్ బ్రిడ్జి మీదుగా వచ్చిన థార్ వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురూ గాయపడగా ఓ చిన్నారి మృతి చెందాడు. కారులోని ముగ్గురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనకు కారణమైన థార్ వాహనంపై అప్పటి బోధన్ ఎమ్మెల్యే షకీల్(Bodh Former MLA Shakeel) పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడం చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు జరిగే సమయంలోనే కారు నడిపింది తానేనంటూ ఆఫ్రాన్ అనే యువకుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. ప్రమాదంపై జూబ్లీహిల్స్ పోలీసులు 304ఎ, 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రజాభవన్ ముందు జరిగిన కారు ప్రమాదంలో నిందుతుణ్ని తప్పిస్తున్నారా - పోలీసుల పాత్రపై అధికారులు అనుమానం
Ex MLA Son Rahil Another Road Accident in 2022 : గతేడాది డిసెంబరు మూడో వారంలో ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో రాహిల్ ఉండటం, తనకు బదులు ఇంకొకర్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేయడమూ వెలుగులోకి వచ్చింది. ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేయడమే కాకుండా రాహిల్‌ను ఇటీవల అరెస్ట్(Raheel Arrest) చేసి జైలుకు తరలించారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసు తెరపైకి వచ్చింది. అప్పట్లోనూ కారు నడిపింది రాహిల్ అని, ప్రమాదం జరగ్గానే అక్కడి నుంచి పరారై తన స్థానంలో ఆఫ్రాన్ ముందుంచినట్లు పోలీసులు అనుమానించారు. బాధితుల నుంచి మరోమారు వాంగ్మూలాన్ని తీసుకుని వాహనం నడిపింది రాహిల్ అని పోలీసులు నిర్ధారించుకున్నారు.
రాహిల్నే మొత్తం చేశాడు : ఈ నేపథ్యంలోనే అప్పట్లో నమోదు చేసిన కేసులో 304ఎ సెక్షన్‌ను మార్చి 304 పార్ట్ 2 కింద దర్యాప్తు పునఃప్రారంభించారు. ప్రమాదం తర్వాత రాహిల్ మామతోపాటు బంధువులు కారు నడిపినట్లు అంగీకరించాలని తనను బలవంతంగా ఒప్పించారని పోలీసుల ముందు ఆఫ్రాన్ చెప్పినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ప్రమాద సమయంలో పనిచేసిన పోలీసు అధికారుల పాత్ర, ప్రమేయంపైనా ఆ శాఖ ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు.
రాహిల్ కేసు వ్యవహారం - జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులోనూ నిందితుడు
మాజీ ఎమ్మెల్యే కుమారుడి హిట్ అండ్ రన్ కేసు - ఒక్కడిని తప్పించబోయి, 15 మంది నిందితులుగా!