తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఆ ఒక్కటి తప్ప కాంగ్రెస్ సర్కార్ చేసిందేం లేదు - రేవంత్ హయాంలోనూ ఫోన్ ట్యాపింగ్ : ఈటల రాజేందర్ - ETELA SLAMS CONGRESS GOVT - ETELA SLAMS CONGRESS GOVT

Etela Rajender Meet The Press Program : మల్కాజిగిరిలో కాంగ్రెస్​, బీఆర్ఎస్​ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కే అవకాశం లేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ అన్నారు. ఏ సర్వేకు అందని ఫలితాలు ఈ నియోజకవర్గంలో వస్తాయని, మైనార్టీలు కూడా కమలం గుర్తుకు ఓటు వేస్తామని చెబుతున్నారని హైదరాబాద్​లోని జరిగిన మీట్​ ది ప్రెస్​ కార్యక్రమంలో తెలిపారు.

Etela on BJP Development
Etela Comments on Congress (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 2:04 PM IST

Etela Rajender Comments On Congress Govt : అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కాంగ్రెస్‌ పరిస్థితి ప్రజలకు అర్థమైందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ అన్నారు. రాష్ట్రంలో 7- 10 శాతం కమీషన్లు ఇస్తే తప్ప పనులు కాని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. మల్కాజిగిరి వాసులందరూ బీజేపీకే ఓటు వేస్తామని అంటున్నారని, స్వచ్చందంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్​లోని సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జరిగిన మీట్​ ది ప్రెస్​ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ​

Etela Comments on Congress: కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు వద్దని రాజీవ్‌గాంధీ చెప్పారని ఈటల తెలిపారు. అణగారిన వర్గాల పేరిట ఓట్లు సంపాదించాలని కాంగ్రెస్ యత్నిస్తుందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించిన అంబేడ్కర్‌ను ఓడించిన పార్టీ అని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించినా అమలు కావట్లేదని అన్నారు. వీడియోలు మార్ఫింగ్‌ చేసి ప్రచారం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం తప్పితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ఈటల అన్నారు. కాళేశ్వరం అవినీతిపరులపై చర్యలు తీసుకోకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్లు పడవని తెలిసి సోమవారం రోజున రైతు భరోసా నిధులు విడుదల చేశారని ఈటల రాజేందర్ విమర్శించారు.

మహిళల అత్మగౌరవాన్ని కాపాడిన నేత మోదీ : ఈటల రాజేందర్​ - lok sabaha elections 2024

"ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేసిన ఘనత బీజేపీదే. అణగారిన వర్గాలను ఆదుకుని అండగా ఉంది మా పార్టీనే. ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పుడున్న కలుషిత రాజకీయాలను చూడలేదు. మా పార్టీ రిజర్వేషన్లు తీసి వేయాలనుకుంటే అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పిస్తుంది?" - ఈటల రాజేందర్​, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి

Etela on BJP Development : తాను రాష్ట్రంలోని 70 రోజుల ప్రచారంలో ఎక్కడా ప్రధాని మోదీ ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించలేదని ఈటల అన్నారు. బీజేపీకి మళ్లీ ఓటు వేసి గెలిపించుకుంటామని స్వచ్ఛందంగా నగరవాసులు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిపారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. ఏ సర్వే సంస్థలకు అందని ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మైనార్టీలు కూడా బీజేపీకి ఓటు వేస్తామని చెబుతున్నారని ఈటల పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ - ఎంపీ బీబీ పాటిల్​ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం : ఈటల రాజేందర్​ - Etela Rajender on KCR

మోదీ గ్యారంటీలే అస్త్రం - లోక్​సభ పోరులో జోరుగా బీజేపీ ప్రచారం - LOK SABHA ELECTION 2024

ABOUT THE AUTHOR

...view details