తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఆ 2 రాష్ట్రాల మోడల్​తో లోక్​సభ బరిలోకి కాంగ్రెస్ - బీజేపీని ఢీకొట్టేందుకు 'పాంచ్​ న్యాయ్​' అస్త్రం - Lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Congress Lok Sabha Elections Manifesto : తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల గ్యారంటీలను పోలిన మేనిఫెస్టోతో కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ ఇచ్చిన గ్యారంటీలతోనే అధికారంలోకి రావడం, సమర్థవంతంగా అమలు చేయడంతో జాతీయ స్థాయిలో వీటిని మోడల్‌గా తీసుకుని ముందుకెళుతోంది. సబ్బండ వర్గాలను ఆకట్టుకునే రీతిలో రూపకల్పన చేసిన "పాంచ్‌ న్యాయ్‌'' గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా లోక్​సభ ఎన్నికల్లో అధిక స్థానాలను కైవసం చేసుకోవచ్చని భావిస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Congress Paanch Nyay Manifesto
Congress Lok Sabha Elections Manifesto

By ETV Bharat Telangana Team

Published : Mar 25, 2024, 7:40 PM IST

Updated : Mar 25, 2024, 8:12 PM IST

బీజేపీను సమర్థవంతంగా అడ్డుకునేందుకు కాంగ్రెస్​ పాంచ్​ న్యాయ్​ వీరిపైనే మెయిన్​ టార్గెట్​

Congress Lok Sabha Elections Manifesto : దేశంలో అధికార బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) "పాంచ్‌ న్యాయ్‌'' గ్యారంటీలతో ప్రజల ముందుకు వెళ్తోంది. తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ఇటీవల రెండు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గ్యారంటీలకు ఓటర్లు ఆకర్షితులైనట్లు జాతీయ స్థాయిలో సీడబ్ల్యూసీ (CWC) సమావేశంలో చర్చకు వచ్చింది. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు, తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఇవ్వడం ద్వారా ఓటర్లను ఆకట్టుకున్నారని, వాటిని విశ్వసించి కాంగ్రెస్‌కే ఓట్లు వేసి అధికారాన్ని కట్టబెట్టారన్న అంచనాకు వచ్చింది.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను మోడల్‌గా తీసుకుని ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ చిదంబరం (Chidambaram) నేతృత్వంలో మరింత లోతైన అధ్యయనం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల నాడిని పట్టుకోడానికి "పాంచ్‌ న్యాయ్‌'' గ్యారంటీలు దోహదం చేస్తాయని భావించారు. రెండు రాష్ట్రాల్లో విజయవంతమైన గ్యారంటీ హామీలతో దేశమంతటా ఐదు న్యాయాల ఎజెండాతో కాంగ్రెస్ ఈ ఎన్నికల బరిలోకి దిగింది. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించిన కాంగ్రెస్,​ ప్రధానంగా మహిళలు, రైతులు, యువత ఓట్లను ఆకట్టుకునేలా ఈ "పాంచ్‌ న్యాయ్‌'' గ్యారంటీలను మేనిఫెస్టోలో చేర్చింది.

ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్‌ వరుస సమీక్షలు - ఈ నెల 27న మిగిలిన స్థానాలకు ప్రకటన - T Congress M P Candidates

Six Guarantees : తెలంగాణలో ఇప్పటికే గ్యారంటీలను అమలులోకి తీసుకురావడం, 100 రోజుల ప్రజా పాలనతో ప్రజలు మరింత ఆకట్టుకోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపుపై రాష్ట్ర నాయకత్వానికి ధీమా వచ్చింది. అదే స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ దేశమంతటికీ మేనిఫెస్టోను రూపొందించటం ఈ ఎన్నికల్లో ఆసక్తి రేపుతోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన మహాలక్ష్మీ పథకం (Mahalaxmi Scheme) మహిళల సాధికారతకు కొత్త బాటలు వేసిందని, మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు కొత్త ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఇంటింటికీ ఆర్థిక తోడ్పడుతున్నాయని అధిష్ఠానం భావిస్తోంది. ఇదే స్ఫూర్తితో దేశంలోని ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఏడాదికి రూ.లక్ష, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే హామీ వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. వాళ్లు కాంగ్రెస్‌కు దగ్గరైతే ఓట్ల రూపంలో లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.

Congress Paanch Nyay Manifesto : రాష్ట్రంలో బీసీల కుల గణనకు (BC count) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాజంలో సగానికిపైగా ఉన్న బీసీ కులాల జనాభాకు దశా దిశను నిర్దేశించనుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే తరహాలో దేశమంతటా కులగుణన చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో హామీ ఇచ్చింది.

కుమురం భీం "జల్ జంగల్ జమీన్'' నినాదం స్ఫూర్తితో సాగు చేసుకుంటున్న అటవీ భూములపై ఆదివాసీలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే హక్కులు కల్పించింది. పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత, అప్పుల బాధ నుంచి రైతులకు ఉపశమనం కల్పించేందుకు శాశ్వత రైతు రుణమాఫీ కమిషన్, పంట నష్టపోయిన రైతులకు 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లిస్తామన్న గ్యారంటీల గురించి మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఉపాధి హామీ పథకంలోనూ రోజుకు కనీస కూలీ రూ.400 ఇవ్వాలని తీర్మానించడం, గ్రామీణ పేదల కోసం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనూ అమలు చేస్తామని ప్రకటించడం విశేషం.

తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ ప్రచార భేరీ - ఏప్రిల్‌ మొదటి వారంలో భారీ బహిరంగ సభ - Lok Sabha Elections 2024

Last Updated : Mar 25, 2024, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details