తెలంగాణ

telangana

ETV Bharat / politics

ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సీఎం రేవంత్‌ బీజేపీలోకి ఎందుకు వెళ్తారు? - కేసీఆర్​కు కాంగ్రెస్ మంత్రుల కౌంటర్ - LOk Sabha Polls 2024 - LOK SABHA POLLS 2024

Congress Leaders Reaction On KCR Comments : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​కు మతిభ్రమించి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. పూర్తి ఆధిక్యంతో ఉన్న ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్‌రెడ్డికి బీజేపీలోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఖాజానాను దివాలా తీయించాం, కనుక ప్రభుత్వం కూలిపోతుందని భావించిన కొందరి కుట్రల్ని పటాపంచలు చేశామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

Congress Leaders Reaction On Kcr Comments
Congress Leaders Reaction On Kcr Comments

By ETV Bharat Telangana Team

Published : Apr 17, 2024, 8:40 AM IST

ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్‌ బీజేపీలోకి ఎందుకువెళ్తారు? : వెంకటరెడ్డి

Congress Leaders Reaction On KCR Comments :సంగారెడ్డి జిల్లా బహిరంగసభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​ రాష్ట్రప్రభుత్వంపై చేసిన విమర్శలను మంత్రులు తిప్పికొట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల(Lok Sabha Polls) సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేసీఆర్‌పై మండిపడ్డారు. కేసీఆర్​, కేటీఆర్ మతిభ్రమించి ఇష్టారీతిన మాట్లాడుతున్నారనికోమటిరెడ్డి విమర్శించారు. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కూడా ఉండదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

Minister Tummala Fires On BRS :గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఈ నెల 19న మహబూబాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభా(Public Meeting) ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి తుమ్మల పరిశీలించారు. ఖాజానాలో చిల్లిగవ్వ మిగల్చకుండా వెళ్లామని కొత్త ప్రభుత్వం(Government) రోజుల్లోనే కూలిపోతుందని భావించిన కొందరి కుట్రలు పటాపంచలు చేస్తూ ప్రజాపాలన అందిస్తున్నామని తుమ్మల అన్నారు.

టార్గెట్ @ 15 - ప్రచారంలో జోష్ పెంచిన కాంగ్రెస్ - LOK SABHA POLLS 2024

"రాష్ట్రాన్ని మనం దివాలా తీయించాం, ఖజానాలో డబ్బు లేకుండా చేశాం కనుక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడపలేదని గత ప్రభుత్వం భావించింది. ఆయా శాఖలకు తలకు మించిన అప్పులు కూడా చేశాం కనుక ప్రభుత్వాన్ని నడపలేరని బీఆర్ఎస్ అనుకుంది. రాష్ట్ర ఖజానాతో పాటు వ్యవస్థలను కూడా గత ప్రభుత్వం విచ్ఛిన్నం చేసింది. కరెంటు, నీటిపారుదల ఇలా అన్ని వ్యవస్థలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రూ.2లక్షల రుణమాఫీని స్వాతంత్య్ర దినోత్సవం లోపు అమలుచేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి"- తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి

Minister Uttam Kumar reddy On BJP :కేంద్రంలో ఇండియా కూటమి(India Alliance) అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని ఆయన విమర్శించారు. పార్లమెంటులో తెలంగాణను హేళన చేసి అవమానపరిచిన మోదీ రాష్ట్రానికి చేసిన ప్రయోజనం శూన్యం అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటిని బలహీనపర్చిన బీజేపీ ఈ దేశానికే ప్రమాదకరమని పేర్కొన్నారు. ఆ పార్టీ మళ్లీ గెలిస్తే ఇప్పుడున్న స్వేచ్ఛ కూడా ఉండదని అభిప్రాయపడ్డారు. అధికారంలో లేనప్పుడు పార్టీ కార్యకర్తలు ఎన్ని అవస్థలు పడ్డారో తనకు తెలుసన్నారు.

నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాక సమావేశం విజయవంతంగా కొనసాగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి .కోమటిరెడ్డి వెంకటరెడ్డి .మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి. ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి. ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి కుందూరు జై వీర్ రెడ్డిలు సమావేశంలోపాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారికి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు.
భయపడితే రాజకీయం చేయలేము - మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు - minister konda surekha fires on ktr

బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నల బతుకులను ఛిన్నాభిన్నం చేసింది : తుమ్మల - Tummala nageswara rao fires On KTR

ABOUT THE AUTHOR

...view details