Congress Restarts Operation Akarsh in Telangana : కాంగ్రెస్ బలోపేతంపై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికల్లో 64 సీట్లు సాధించి అధికార పగ్గాలు చేపట్టిన హస్తం పార్టీ, కొంత కాలానికే చేరికల కోసం తలుపులు తెరిచినట్టు ప్రకటించింది. భవిష్యత్తులో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే త్వరలోనే పదుల సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనున్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి.
ఈ సమయంలోనే ఖైరతాబాద్, స్టేషన్ ఘన్‌పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు హస్తం గూటికి చేరారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావటం, అటు ఏఐసీసీ నుంచి అనుమతి రాకపోవటంతో ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన రాష్ట్ర పీసీసీ, మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ జోరు పెంచింది. ఇందులో భాగంగానే మాజీ శాసన సభాపతి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి, ఆయన నివాసానికి వెళ్లి కండువా కప్పారు. తాజాగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు కండువా కప్పి రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు - ఇక మిగిలింది అదే! - Congress focus on merger of BRSLP
ఈ ఐదుగురు ఎమ్మెల్యేలే కాకుండా, మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అందులో హైదరాబాద్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రకటిస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకోవడానికి 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సి ఉందని పీసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతంగా కొనసాగుతున్నట్టు చెబుతున్నాయి.
ముందు జాగ్రత్తతో : బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కాంగ్రెస్ ముఖ్య నాయకులు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ శాసనసభ్యులతో సంప్రదింపులు జరిపి, పార్టీలోకి ఆహ్వానించేందుకు కొంతమంది ముఖ్యులు అంతర్గతంగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నాటికి గులాబీ పార్టీ నుంచి చేరే ఎమ్మెల్యేల సంఖ్య దాదాపు 20కు చేరుకునే అవకాశం ఉంటుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందటంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కమలం పార్టీ ఎమ్మెల్యేల చేరికపై దృష్టిపెడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే జరిగితే బీజేపీ బలపడుతుందని ఆ పరిస్థితి రాకముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది.
Telangana Congress Joinings : కాంగ్రెస్‌లో చేరికలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. బుజ్జగింపులే కారణమా..?
T Congress focus on Joinings : బీజేపీ అసంతృప్తులకు.. హస్తం గాలం.. అంతా తెరవెనుక రాజకీయం