LOK SABHA ELECTIONS 2024 : రాష్ట్రంలో పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ఎన్నికల ప్రచారం శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులందరూ సుడిగాలి వేగంతో ప్రచారం చేస్తున్నారు. ఎండలు సైతం లెక్కచేయకుండా మారుమూల గ్రామాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి టికెట్ దక్కించుకున్న నేతలు, ఈసారి గెలుపే లక్ష్యంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
బాండ్ పేపర్ రాసి మరీ అర్వింద్ మాట తప్పారు : జీవన్‌రెడ్డి - JEEVAN REDDY CHAI PE CHARCHA
జగిత్యాలలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తనకు, వచ్చిన రెండో అవకాశంలో నిజామాబాద్ ఎంపీగా ఓడిపోతే తట్టుకునే శక్తి లేదంటూ నిజామాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా రేచపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జగిత్యాలలో ఎమ్మెల్యేగా ఓడిపోవడం, దేవుడు తనకు ఎందుకు శిక్ష విధించిండో తెలియదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాగైన తనను ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన రాజకీయ జీవితం జగిత్యాల నుంచే ప్రారంభించానని, కానీ గత ఎన్నికల్లో ఓడిపోవడం నిజంగా దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తాను ఎమ్మెల్యేగా గెలిచినట్లయితే మంత్రి పదవి వచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేవాడినని పేర్కొన్నారు. గెలుపోటములు సహజమని, ఎంత కష్టపడినా విజయానికి అదృష్టం సైతం కలిసి రావాలని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.