CM YS Jagan Stone Attack Case :సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో టీడీపీ నేత దుర్గారావును అదుపులోకి తీసుకోవటం కలకలం రేపుతోంది. సాయం కావాలని ఎవరైనా వస్తే తోడుగా ఉండే వ్యక్తి ని పోలీసులు అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమ్మా నాన్నను పోలీసులు చంపేస్తారా? :రెండు నెలల క్రితం వేముల దుర్గారావుటీడీపీలో చేరారు. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి చంద్రలిఖిత నాలుగో తరగతి, రెండో కుమార్తె తరుణి రెండో తరగతి చదువుతున్నారు. కుమారుడు నిఖిల్ సిద్ధార్థ్ ఎల్‌కేజీ చదువుతున్నారు. దుర్గారావు భార్య శాంతి అంగన్‌వాడీ ఆయాగా పని చేస్తోంది. తండ్రిని పోలీసులు పట్టుకెళ్లారని తెలిసిన నాటి నుంచి పిల్లలు అన్నం తినటం మానేశారు. "నాన్న ఎక్కడ? ఎపుడు వస్తారు? అమ్మా నాన్నను పోలీసులు చంపేస్తారా?" అని పిల్లలు అడుగుతుంటే సమాధానం చెప్పలేక తల్లి, బంధువులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఆటో నడిపి డబ్బులు తెస్తేనే పూట గడిచే ఆ కుటుంబం మంగళవారం రాత్రి నుంచి మంచినీళ్లు ముట్టలేదు. భర్త కోసం పిల్లలతో భార్య శాంతి పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది.
సీఎంపై దాడి కేసులో యువకులు అరెస్ట్ - సీపీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులు నిరసన - Attack on CM Jagan
ప్రతిపక్ష పార్టీలో చేరితే కేసులు బనాయిస్తారా? : టీడీపీలో చేరడమే ఆయన చేసిన తప్పా? తండ్రి కోసం పిల్లలు మంగళవారం రాత్రి నుంచి తిండి లేక అల్లాడుతున్నారని, ఈ కేసుకు సంబంధించి ఏ ఆధారాలు ఉన్నాయని, ఆయనను అదుపులోకి తీసుకున్నారని, భర్తను తనకు చూపించాలని దుర్గారావు భార్య శాంతి పోలీసులను డిమాండ్ చేసింది. తన భర్తకు ఈ కేసుతో ఏం సంబంధం ఉందని పోలీసులు తీసుకెళ్లారో? సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తుంది.