Lok Sabha Elections 2024 :రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఖ్యాతి గుజరాత్ కంటే ఎక్కువగా పెరిగిందని బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని, హైదరాబాద్‌లో మతచిచ్చు పెట్టి శాంతిభద్రతలు చెడగొట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు తీర్పు ఇచ్చినట్లే : రేవంత్ రెడ్డి - CM Revanth Election Campaign
ఈసందర్బంగా మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌కు ఓఆర్‌ఆర్, విమానాశ్రయం, పరిశ్రమలను తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని, సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్, విమానాశ్రయం, పరిశ్రమలు వచ్చాకే రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పెరిగాయని ఆయన స్పష్టం చేశారు. మత కల్లోలాలు లేవు కాబట్టే హైదరాబాద్ ఖ్యాతి అంతర్జాతీయంగా పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు.
బీజేపీ వాళ్ల మాటలు నమ్మి రాష్ట్రాన్ని ఆగం చేసుకోవద్దని, సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఖ్యాతి గుజరాత్ కంటే ఎక్కువగా పెరిగిందని బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని, భాగ్యనగరానికి వచ్చే పెట్టుబడులను గుజరాత్‌కు తరలించుకుపోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. మతసామరస్యాన్ని కాపాడేవాడే అసలైన హిందువని, దేవుడి పటాన్ని నడిరోడ్డులో పెట్టి ఓట్లు అడుక్కునే వాడు హిందువా? అని ప్రశ్నించారు.
బీజేపీ పాలిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు ఎందుకు పెట్టుబడులు రావటం లేదో తెలుసా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న మతకలహాల వల్లే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావటం లేదని పేర్కొన్నారు. గుజరాత్ బాగుండాలి, పెట్టుబడులు రావాలి. హైదరాబాద్‌లో కత్తులతో పొడుచుకోవాలనేది బీజేపీ కుట్రగా తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో తెస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత షాద్‌నగర్‌కు తెస్తానని స్పష్టం చేశారు. ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
పాలమూరు బిడ్డకు, దిల్లీ సుల్తాన్‌లకు మధ్య జరుగుతున్న పోరు అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. షెడ్డుకు పోయిన కారు, మళ్లీ తిరిగిరాదని చెప్పానని, కారు పనికిరాకుండా పోయినందునే కేసీఆర్ బస్సెక్కి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
"రాష్ట్రానికి వచ్చిన మోదీ, నిధులు కేటాయిస్తారనుకుంటే కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ వందరోజుల పాలనలో అవినీతి జరిగినట్లు ఆరోపిస్తున్నారు. నేను ఓపెన్‌గా ఛాలెంజ్ చేస్తున్న, ఎవరి పాలనలో అవినీతి జరిగిందో ప్రజలను అడుగుదాం. మాది నిజమయితే నేను షాద్‌నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా".- రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
హైదరాబాద్‌లో మతచిచ్చు పెట్టి, శాంతిభద్రతలు చెడగొట్టాలని చూస్తున్నారు : సీఎం రేవంత్‌రెడ్డి (ETV BHARAT) రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు : సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth Election Campaign
తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్‌ను తీర్చిదిద్దుతా : సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth Road Show in Warangal