CM Revanth Reddy Returned to Hyderabad :తెలంగాణ రైజింగ్ బృందం విదేశీ పర్యటన ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సింగపూర్, దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకుంది. దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. సింగపూర్, దావోస్ పర్యటన విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు, కార్యకర్తలు రేవంత్ రెడ్డిని కొనియాడారు.
సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు : విమానాశ్రయంలో రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, దానం నగేందర్, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. దావోస్‌లో మొత్తం రూ.1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత పర్యటనలో రూ.40,232 కోట్ల పెట్టుబడులు రాగా, ఈసారి దానికి 4 రెట్లు పెరిగాయి. తాజా పెట్టుబడులతో దాదాపుగా 50 వేల ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 20 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.