CM Revanth Comments on KCR : కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్ బాధ్యత అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కాలం చెల్లిన ఔషధమని పేర్కొన్నారు. ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. కాళేశ్వరంపై విచారణ(Kaleshwaram Project Issue)కు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందన్న రేవంత్ రెడ్డి, విశ్రాంత జడ్జితో విచారణ జరిపించుకోవాలని చెప్పారని వెల్లడించారు. హైకోర్టు చెప్పిన అంశంపై మంత్రివర్గంలో లేదా అసెంబ్లీలో చర్చిస్తామని వివరించారు.
"కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాను. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు చూశారు. కేసీఆర్ చిత్తశుద్ధిని గుర్తించి కృష్ణా పరివాహక ప్రజలు తీర్పు ఇచ్చారు. మిషన్ భగీరథపై విచారణకు ఆదేశించాం. ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టతతో ఉన్నాం. విధానపర లోపాలు లేకుండా పాలన సాగిస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేసేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది."- రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి
అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం కట్టారు : మంత్రి కోమటిరెడ్డి
Revanth On Harish Rao BAC Meeting : మరోవైపు బీఏసీ సమావేశానికి కేసీఆర్ స్థానంలో హరీశ్ రావు(Harish Rao) వెళ్లడంపై సీఎం రేవంత్ స్పందించారు. బీఏసీ సమావేశానికి అందులోని సభ్యులే రావాలని స్పష్టం చేశారు. రేపు హిమాన్షు (కేటీఆర్ తనయుడు) కూడా వస్తానంటే ఎలా అని ఎద్దేవా చేశారు. ఐదేళ్లపాటు శాసనసభ వ్యవహారాల మంత్రిగా చేసిన హరీశ్ రావుకు ఆ మాత్రం అవగాహన లేదా? అని ప్రశ్నించారు.