CM Chandrababu Naidu Fires on TDP MLAs :కొందరు ఎమ్మెల్యేల వ్యవహారిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దాదాపు 15 మంది ఎమ్మెల్యేల ప్రవర్తనతో విసిగిస్తోందని సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది. వీరిలో కొందరిని ఎంపిక చేసుకుని ఈ శనివారం విడివిడిగా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
TDP MLAs Involved in Liquor Tender 2024! : ఉచిత ఇసుక సరఫరా, మద్యం టెండర్లలో కొందరు ఎమ్మెల్యేల జోక్యం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఇంకొందరి వ్యవహారశైలి క్యాడర్‌కు అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాలన వ్యవహారాల్లో పడి రాజకీయాలు పట్టించుకోకుంటే 2014-19మధ్య జరిగిన తప్పిదమే పునరావృతమవుతుందని పలువురు సీనియర్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
లిక్కర్ లాటరీలో ఎన్నో సిత్రాలు - బీజేపీ నేతకు 5 దుకాణాలు - మంత్రి నారాయణ 100 దరఖాస్తులు
టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో మొదటిసారి సమావేశం : తెలుగుదేశం పార్టీకి చెందిన దాదాపు 15 మంది ఎమ్మెల్యేల తీరుతో తాను విసిగిపోయానని ఓ వారం రోజుల పాటైనా పార్టీపైన శ్రద్ధ పెట్టి గీతదాటుతున్న నేతలను దారిలోకి తేవాలని సీనియర్ల వద్ద సీఎం అన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలపై క్షేత్రస్థాయి నుంచి తనకు వస్తున్న ఫిర్యాదులు ఆధారంగానే ఈ నెల 18వ తేదీన తెలుగుదేశం శాసనసభ పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. పార్టీ శాసనసభ పక్ష సమావేశం సాధారణంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో పెట్టడం ఆనవాయితీ. ఈసారి అందుకు భిన్నంగా అసెంబ్లీ లేని సమయంలో పెడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకూ 3 పార్టీలతో కలిపే చంద్రబాబు సమావేశం నిర్వహించారు తప్ప పార్టీ నేతలతో విడిగా సమావేశం పెట్టలేదు.
మద్యం టెండర్లలో జోక్యం సహించేది లేదు - కక్షలు తీర్చుకునే స్వభావం నాది కాదు : సీఎం చంద్రబాబు
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 18న జరిగే తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలతో పాటు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు హాజరు కానున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, ఎమ్మెల్యేల పని తీరు, పార్టీ కేడర్‌తో పాటు మిత్రపక్షాలతో సమన్వయం వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. సమావేశం ముగిశాక అదే రోజు, మరుసటి రోజైన 19వ తేదీన కొందరు ఎంపిక చేసిన ఎమ్మెల్యేలతో చంద్రబాబు విడివిడిగా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. వ్యవహారశైలి బాలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వారితో చంద్రబాబు గట్టిగానే మాట్లాడతారని సమాచారం. విడిగా పిలిచే జాబితాలో తమ పేరుందేమో అని ఉత్కంఠ కొందరు నేతల్లో నెలకొంది.
"ఇదేందయ్యా ఇదీ!" ఆ దుకాణాలకు ఒక్కటే దరఖాస్తు - మద్యం టెండర్లలో రింగ్ ?