KTR petition in Supreme Court: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు రిజిస్ట్రీలో కేటీఆర్ న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసు నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ నిబంధనలకు విరుద్ధంగా నిధుల బదలాయింపు జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ(Enforcement Directorate) సైతం రంగంలోకి దిగి కేటీఆర్‌కు మరోసారి నోటీసులిచ్చింది. ఈ నెల 16న విచారణకు రావాలని అందులో పేర్కొంది. అయితే ఏసీబీ కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ప్రభుత్వ వాదనలు కూడా వినాలి: మరో వైపు తెలంగాణ హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని ముందస్తుగానే పిటిషన్
పిటీషన్ కొట్టివేత: ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నేరపూరిత కుట్ర జరిగిందని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు చేశారని అతను సాధారణ వ్యక్తి కాదని బాధ్యతగల హోదాలో ఉన్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అని హైకోర్టు తెలిపింది. కేటీఆర్ హెచ్‌ఎండీఏ నిధులను అక్రమంగా వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారన్న ఉన్నత న్యాయస్థానం నిధుల దుర్వినియోగం జరగడంలేదని పిటిషనర్ వాదించడాన్ని నమ్మడం లేదని తెలిపింది.
మచిలీపట్నంలోని గ్రీన్ కో ఎనర్జీ కార్యాలయంలో తెలంగాణ ఏసీబీ సోదాలు
ఈ విషయాలన్నీ దర్యాప్తులో తేలాల్సి ఉందని స్పష్టం చేసింది. హెచ్‌ఎండీఏ నిధులు దుర్వినియోగమయ్యాయా లేదా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని పేర్కొంది. నేరం జరిగిందని చెప్పడానికి ప్రాథమిక ఆరోపణలు మాత్రమే ఎఫ్‌ఐఆర్‌లో ఉంటాయని పూర్తిస్థాయి వివరాలన్ని ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చాల్సిన అవసరం లేదంది.
అబద్ధాలు నన్న విచ్ఛిన్నం చేయవు: ఎదురుదెబ్బ తర్వాత పునరాగమనం మరింత బలంగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎక్స్(X) వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన మాటల్ని రాసిపెట్టుకోండి అని పేర్కొన్నారు. అబద్ధాలు తనను విచ్ఛిన్నం చేయవు మాటలు తనను తగ్గించలేవన్నారు. ఈ చర్యలు తన దృష్టిని మరల్చలేవన్న కేటీఆర్ కోపం తనను నిశ్శబ్దం చేయదని తెలిపారు.
Mark my words, Our comeback will be stronger than this setback
— KTR (@KTRBRS) January 7, 2025
Your lies won't shatter me
Your words won't diminish me
Your actions won't obscure my vision
This cacophony won't silence me!
Today's obstacles will give way to tomorrow's triumph.
Truth will shine brighter with…
నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయని అన్నారు. సత్యం కాలంతోపాటు మరింతగా ప్రకాశిస్తుందని చెప్పారు. న్యాయవ్యవస్థను తాను గౌరవిస్తానన్న ఆయన న్యాయం గెలుస్తుందని తన అచంచలమైన నమ్మకమని అన్నారు. సత్యం కోసం తన పోరాటం కొనసాగుతుందని త్వరలో ప్రపంచం అంతా దానికి సాక్ష్యం అవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
రేపు విశాఖకు ప్రధాని - ప్రత్యేక ఆకర్షణగా మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో
అసభ్యకరమైన పోస్టుల కేసు - పోలీసుల అదుపులో అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి